మళ్ళీ విద్యుత్ ఛార్జీల పోటుఃసిపిఎం
హైదరాబాద్‌ః భారీగావిద్యుత్ ఛార్జీలు పెంచి వినియోగ దారుల నడ్డివిరిచిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో మరోసారివిద్యుత్ ఛార్జీలు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నదని సిపిఎం ఆరోపించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు ఆదివారం హైదరాబాద్ లోవిలేకరులతో మాట్లాడుతూ సంస్ధాగత ఎన్నికల్లో పరాజయంపాలైనప్పటికీ విద్యుత్ సంస్కరణలు ఆగవంటూ చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం అని ఆయన అన్నారు.
పంచాయతీ ఎన్నికల్లలో ప్రభుత్వం ఎత్తుగడను తమ పార్టీ ప్రచారం చేస్తుందని, ఓటర్లను జాగృతం చేస్తుందని రాఘవులు చెప్పారు.పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ఇప్పటికే ప్రజలు విలవిలలాడిపోతుంటే ప్రభుత్వం ప్రపంచబాంక్ కు దాసోహంఅంటూ మరో సారి చార్జీల వడ్డనకు సిద్ధం కావడం సిగ్గుచేటని ఆయన అన్నారు. పార్టీ రహితంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్ధులను ఓడించాల్సిందిగా ప్రజలను కోరతామని ఆయన చెప్పారు
అంగన్ వాడీ కార్యకర్తలు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసిందని, ఇది చట్టవిరుద్ధమని ఆయనవిమర్శించారు.












Click it and Unblock the Notifications