ఎన్ కౌంటర్ లో నలుగురు నక్సల్స్ మృతి
కరీంనగర్‌ః కరీంనగర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు నక్సలైట్లు మరణించారు. కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం రుద్రంగి అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో జనశక్తి దళానికి చెందిన నలుగురు నక్సలైట్లు మరణించినట్లు సమాచారంఅందింది.
కూంబింగ్ చేపట్టిన పోలీసు దళాలకు నక్సలైట్లు తారసపడ్డారు. లొంగిపోవాల్సిందిగా పోలీసులు చేసిన హెచ్చరికలను ఖాతరు చేయకుండా నక్సలైట్లు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు నక్సలైట్లు మరణించారు.












Click it and Unblock the Notifications