టెర్రరిస్టులపై ముషారఫ్ గురి
ఇస్లామాబాద్‌ః తీవ్రవాదులను, కరుడుగట్టిన నేరస్థుల ఆటకట్టించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎట్టకేలకు నడుం కట్టింది. అయితే తీవ్రవాదాన్ని ప్రోత్సహించే మతసంస్థలను నిషేధించేందుకు మాత్రం పాక్ ససేమిరాఅంటున్నది. పాకిస్తాన్ లో తీవ్రదులు, నేరస్తులను తుదముట్టించాలంటూ శనివారం జరిగిన దేశం అంతరింగిక వ్యవహారాల సమావేశంలో దేశాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ నిర్ణయించారు.
పాకిస్తాన్ వెనకబాటుకు టెర్రరిస్టులే కారణం అని..... వారిని స్వయంగా వెళ్ళి కాల్చి చంపాలనిపిస్తున్నదంటూ ముషారఫ్ రెండు రోజుల కిందట ఒక సమావేశంలో ప్రకటించారు. వెంటనే ఆంతరంగికి సమావేశం ఏర్పాటు చేసి టెర్రరిస్టులను తుదముట్టించేందుకు రంగం సిద్ధం చేయడం విశేషం.
పాకిస్తాన్ సైనిక, రక్షణ, పోలీసు విభాగాలకు చెందిన ప్రముఖులు ఈ ఆంతరంగిక సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్తాన్ ఇంటా బయటా నాశనం కావడానికి టెర్రరిస్టులే కారణం అని ముషారఫ్ వ్యాఖ్యానించారని తెలిసింది. ముషారఫ్ లో వచ్చిన ఈ మార్పుకు కారణం ఏమిటనేది దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అంగన్ వాడీ కార్యకర్తలు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసిందని, ఇది చట్టవిరుద్ధమని ఆయనవిమర్శించారు.












Click it and Unblock the Notifications