వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌తాంత్రిక్‌లో చీలిక-రాజ్‌నాథ్‌కు ఊరట

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నాః లోక్‌ తాంత్రిక్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ ఉత్తరప్రదేశ్‌ లోని రాజ్‌ నాథ్‌ సింగ్‌ సర్కార్‌ మైనారిటీ గండం నుంచి గట్టెక్కే సూచనలుకనిపిస్తున్నాయి. లోక్‌తాంత్రిక్‌ కాంగ్రెస్‌కు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు శనివారం నాడు సమావేశమై నరేశ్‌ అగర్వాల్‌ను శాసనసభాపక్షం నాయకత్వం నుంచి తప్పిస్తున్నట్టుగా ప్రకటించింది. రాజ్‌నాథ్‌సింగ్‌కు తమ మద్దతు కొనసాగుతుందని ఈ గ్రూప్‌ పేర్కొంది. ఈ గ్రూప్‌ కొత్త నేతగా శ్యామ్‌సుందర్‌ శర్మ ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షపదవినుంచి కూడా తాము నరేష్‌ అగర్వాల్‌ను తొలిగిస్తున్నట్టుగా ఈ గ్రూప్‌ ప్రకటించింది. రాజ్‌నాథ్‌ సర్కార్‌ పునాదులను కదలించగలడని అంతా భావించిన నరేష్‌ అగర్వాల్‌ తన పునాదులే కదిలిపోవడంతో ఇప్పుడు ప్రతీకారం కోసం కొత్త వ్యూహాలకు పదనుపెట్టే ప్రయత్నంలో పడ్డారు. వీలుంటే సమాజ్‌వాది పార్టీతో చేతులు కలిపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది. మొత్తానికి గత రెండు రోజుల్లో శరవేగంతో మారిన రాజకీయ సమీకరణలతో బిజెపి సర్కారుకు మాత్రం ముప్పు తప్పింది.విద్యుత్‌ శాఖ మంత్రి నరేష్‌ అగర్వాల్‌ ను మంత్రి పదవి నుంచి తొలగించడంతో రాజ్‌ నాథ్‌ సింగ్‌ సర్కారుకుమద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు అగర్వాల్‌ప్రకటించారు.

తాజా పరిణామాల నేపథ్యంతో నరేష్‌అగర్వాల్‌ ఢిల్లీ నుంచి హుటాహుటిన లక్నో చేరుకున్నారు. బిజెపి సర్కార్‌ కు తమ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటున్నదనేవిషయాన్ని నరేష్‌ గవర్నర్‌ కు చెప్పనున్నారు.అందుకోసం ఆయన గవర్నర్‌ ను కలిసే సూచనలున్నాయి.

అసలు లోక్‌ తాంత్రిక్‌ మద్దతు లేనప్పటికీ అజిత్‌ సింగ్‌ సారధ్యంలోని లోక్‌ దళ్‌ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్ల్యేల మద్దతుతో మైనార్టీ గండం నుంచి గట్టేక్కేందుకు రాజ్‌ నాథ్‌ సింగ్‌ సర్కారు ప్రయత్నిస్తున్నది. ఏది ఏమైనప్పటికీ తాజా పరిణామాలు ఉత్తర ప్రదేశ్‌ లో త్వరలో జరగునున్నఅసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అవకాశాలను బాగా దెబ్బతీసే ప్రమాదం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

  • సంక్షోభంలో యు.పి. సర్కార్‌
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X