ఏపీలోనూ విజయ్ తరహా పార్టీ ? టీడీపీ, వైసీపీకి చెక్ పెట్టాలన్న సాయిరెడ్డి..!
దశాబ్దాలుగా తమిళనాడును ఏలుతున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల్ని కాదని మూడో ప్రత్యామ్నాయంగా విజయ్ టీవీకేకు అక్కడి ప్రజలు పట్టం కట్టిన నేపథ్యంలో ఏపీలోనూ అలాంటి ప్రత్యామ్నాయం కోసం డిమాండ్లు మొదలయ్యాయి. ఇదే క్రమంలో వైసీపీ మాజీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) కూడా అలాంటి డిమాండే చేశారు. ఎప్పుడూ టీడీపీ, వైసీపీయేనా, ఈ రెండు పార్టీలు లేకుండా ప్రత్యామ్నాయంగా మూడో పార్టీ రావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ఏపీలో మూడో ప్రత్యామ్నాయం కోరుతూ విజయసాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండు తీవ్ర ధోరణుల మధ్య చిక్కుకుపోయాయని సాయిరెడ్డి తెలిపారు. ఇందులో ఒకటి, గ్రామీణ ప్రాంతాలను విస్మరించే టీడీపీ యొక్క పట్టణ కేంద్రీకృత దృక్పథమని, మరొకటి, అభివృద్ధిపై దార్శనికత లేని వైఎస్సార్‌సీపీ యొక్క కేవలం సంక్షేమ విధానమని ఆయన చెప్పుకొచ్చారు.

AP’s politics is stuck between two extremes, TDP’s urban centric outlook that ignores rural areas and YSRCP’s only welfare approach with no vision for growth. What AP needs is a credible 3rd alternative, one that brings parity between development and welfare, bringing in foreign…
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 11, 2026
కాబట్టి ఆంధ్రప్రదేశ్‌కు కావలసింది ఒక విశ్వసనీయమైన మూడవ ప్రత్యామ్నాయమని విజయసాయిరెడ్డి తెలిపారు. అది అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యతను తీసుకువస్తూ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తూ, వాటి ప్రయోజనాలు రాష్ట్రంలోని ప్రతి మూలకూ చేరేలా చూడాలని సాయిరెడ్డి తెలిపారు. తద్వారా సింపుల్ గా తమిళనాడులో విజయ్ పార్టీలా ఇక్కడ కూడా ఓ ప్రత్యామ్నాయం రావాలని, దానికి ఇలాంటి విధివిధానాలు ఉండాలని చెప్పేశారు. అయితే సాయిరెడ్డి తన ట్వీట్ లో ఎక్కడా విజయ్ పార్టీ పేరెత్తలేదు. అలాగే ఏపీలో టీడీపీ-వైసీపీ కాకుండా ఉన్న మూడో పార్టీ జనసేన పేరు కూడా ప్రస్తావించలేదు.














Click it and Unblock the Notifications