విజయ్ సీఎం అవ్వటంతో అసలు విషయం బయట పెట్టిన త్రిష- ప్రేమ ఎప్పుడూ..!!

విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. తొలి రోజు నుంచే తన మార్క్ చూపించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ తో సహా అన్నా డీఎంకే నేతల ఇళ్ల కు వెళ్లనున్నారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార వేదిక వద్ద త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ సీఎంగా ప్రమాణం చేస్తున్న సమయంలో ఎమోషనల్ అయ్యారు. కాగా.. ఇప్పుడు చేసిన సోషల్ మీడియా పోస్టింగ్ లో అసలు విషయం బయట పెట్టారు. విజయ్ ప్రమాణ స్వీకారం కు హాజరైన ఫొటోలు షేర్ చేస్తూ.. స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

కొంతకాలంగా విజయ్-త్రిషల మధ్య సాన్నిహిత్యంపై సోషల్ మీడియాలో ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో సీఎంగా ప్రమాణ స్వీకారానికి త్రిష హాజరయ్యారు. త్రిష తన తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఈ చారిత్రక సందర్భానికి తగ్గట్లుగా హుందాగా కనిపించారు. సీ-ఫోమ్ గ్రీన్ కలర్ చీర, బంగారు వర్ణపు ఎంబ్రాయిడరీ ఉన్న క్రీమ్ కలర్ బ్లౌజ్ ధరించి సంప్రదాయబద్ధంగా మెరిశారు త్రిష. ఎర్రటి రాళ్లు పొదిగిన నగలతో త్రిష లుక్ ఎంతో ఆకర్షణీయంగా కనిపించారు. ఈ కార్యక్రమం అనంతరం త్రిష తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోలను షేర్ చేశారు. సీఫోమ్ గ్రీన్ శారీలో సంప్రదాయ లుక్‌లో మెరిసిన త్రిష ఈ రోజు చేసిన సోషల్ మీడియా పోస్లింగ్ లో 'The love is always louder' అనే క్యాప్షన్‌ను జోడించారు.

విజయ్ మరో సంచలనం, నేరుగా స్టాలిన్ తో భేటీ - కీలక మలుపు..!!
విజయ్ మరో సంచలనం, నేరుగా స్టాలిన్ తో భేటీ - కీలక మలుపు..!!
trisha-krishnan-has-shared-her-first-post-on-instagram-after-thalapathy-vijays-oath-ceremony-as-tam

త్రిష పోస్టులో మళ్లీ చర్చ మొదలు

కాగా, ఇప్పుడు ఈ పోస్ట్ కాస్తా వైరల్ అవ్వగా.. నెటిజన్లు ఆ వ్యాఖ్యను విజయ్‌తో అనుసంధానం చేస్తూ విస్తృతంగా చర్చిస్తున్నారు. విజయ్, త్రిషల మధ్య ఉన్న స్నేహంపై గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తల నేపథ్యంలో, త్రిష చేసిన ఈ కామెంట్ ఏదో అంతరార్థాన్ని సూచిస్తోందని నెటిజన్లు భావిస్తున్నారు. కాగా.. అటు విజయ్ ముఖ్యమంత్రిగా బిజీ అయిపోయారు. సీఎంగా తన తొలి ప్రసంగంలో తాను మినహా మరో పవర్ సెంటర్ ఉండదని చెప్పటం ద్వారా.. త్రిష పవర్ లో ఎలాంటి జోక్యం ఉండదనే సంకేతాలు ఇచ్చారనే చర్చ జరిగింది. ఇప్పుడు త్రిష సోషల్ మీడియా పోస్టింగ్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారనే అనే అంశం పైన ఎవరికి నచ్చినట్లు వారు విశ్లేషణ లు చేస్తున్నారు. దీంతో.. రానున్న రోజుల్లో త్రిష వ్యవహారం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+