13వ తేదీ నుంచి జాతకం మారిపోతున్న మేషం, వృశ్చికం, ధనుస్సు రాశులవారు

శ్రీమహావిష్ణువు అనుగ్రహం మెండుగా లభించే పవిత్రమైన రోజు 'అపర ఏకాదశి'. ఈ ఏడాది మే 13న రాబోతున్న ఈ ఏకాదశి, జ్యోతిష్య శాస్త్ర రీత్యా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ శుభదినాన విశ్వంలో అరుదైన 'పారిజాత యోగం' రూపుదిద్దుకోనుంది. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ఏర్పడే ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారి జాతకాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి.

వారు వేసే ప్రతి అడుగు విజయతీరాలకు చేర్చడంతోపాటు, సంపద వెల్లువెత్తుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆ రాశుల గురించి తెలుసుకుందాం. ఏకాదశి రోజున అలంకార ప్రియుడైన విష్ణుమూర్తికి షోడషోపచార పూజలు నిర్వహించి, వ్రతాన్ని ఆచరించేవారికి పాప పరిహారంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

Horoscope Aries Scorpio and Sagittarius Those whose fortunes are set to change starting from the 13th

మేష రాశి వారికి విజయ పరంపర

అపర ఏకాదశి నుంచి మేష రాశి వారికి అంతా కలిసివస్తుంది. ఊహించని విధంగా ధన ప్రాప్తి కలుగుతుంది. నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు, ఉద్యోగులకు మార్గం సుగమం అవుతుంది. కోర్టు సంబంధిత వివాదాల్లో విజయం మీదే. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, మీరు ఇష్టపడిన వ్యక్తితో జీవితాన్ని పంచుకునే యోగం ఉంది. సమాజంలో మీ మాటకు తిరుగుండదు.

వృశ్చిక రాశి వారికి రియల్ ఎస్టేట్ యోగం

పారిజాత యోగం వృశ్చిక రాశి వారి జీవితంలో కొత్త వెలుగులు నింపనుంది. మీ మాట తీరుతో పదిమందిని ఆకట్టుకుంటారు. ఎంతటి కఠినమైన పనినైనా మీ వాక్ ధాటితో సాధించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భారీ లాభాలు చేకూరే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి. సోదరులతో ఉన్న మనస్పర్థలు తొలగి సఖ్యత ఏర్పడుతుంది. మీరు ఆశించిన దానికంటే ఉన్నతమైన హోదాను, గౌరవ మర్యాదలను పొందుతారు.

ధనుస్సు రాశి వారికి రాజయోగం

ఈ రాశి వారికి అపర ఏకాదశి నుంచి తిరుగులేని రాజయోగం ప్రారంభం కానుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనే మీ కల నెరవేరుతుంది. చాలా కాలం క్రితం మొండి బకాయిలుగా మిగిలిపోయిన సొమ్ము అనూహ్యంగా మీ చేతికి అందుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి పదవీ లాభం, సంఘంలో చక్రం తిప్పే స్థాయి లభిస్తాయి. న్యాయపరమైన చిక్కుల నుంచి విముక్తి లభిస్తుంది. మీరు చేసే పనులకు సామాజిక గుర్తింపు లభించడమే కాకుండా, కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+