అందరికీ నాపైనే క్రష్.. టామ్ క్రూజ్ నాపై మనసు పారేసుకున్నారు: బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ త్వరలో ప్రైమ్ వీడియోలో ప్రసారం కానున్న 'ది ట్రేటర్స్ 2' అనే రియాలిటీ షోలో కనిపించనుంది. ఈ షో ప్రసారానికి ముందు దానికి సంబంధించిన ఒక ప్రోమో లేదా వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మల్లికా షెరావత్ హాలీవుడ్ ప్రముఖ నటుడు టామ్ క్రూజ్‌తో తనకున్న పరిచయం, ఆయన పంపే సందేశాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఓటీటీలోకి రూ. 10 వేల కోట్లు కొల్లగొట్టిన సినిమా.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!
ఓటీటీలోకి రూ. 10 వేల కోట్లు కొల్లగొట్టిన సినిమా.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!

ఈ వీడియోలో షో కంటెస్టెంట్, హాస్యనటుడు ఆదిత్య కులశ్రేష్ఠ(కుల్లు).. "మీకు ఎవరిపైనైనా క్రష్ ఉందా, లేదా అందరూ మీపైనే క్రష్ పెంచుకుంటారా?" అని అడిగిన ప్రశ్నకు మల్లిక షెరావత్ సమాధానమిచ్చింంది. దీనికి సమాధానమిస్తూ.. "నాకు ఎవరిపై క్రష్ లేదు. అందరికీ నాపైనే క్రష్ ఉంది. ఇటీవల కాలంలో హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ కూడా నాపై మనసు పారేసుకున్నారు. నేను అబద్ధం చెప్పట్లేదు. నా దగ్గర ఫోన్ ఉంటే మేమిద్దరం కలిసి ఉన్న ఫోటోలు, ఆయన పంపిన వీడియోలను చూపించేదాన్ని" అని మల్లికా షెరావత్ పేర్కొన్నారు.

Mallika Sherawat Claims Tom Cruise Has a Crush on Her Netizens Call It Urvashi Syndrome Full Details

బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ చేసిన ఈ కామెంట్లపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె మాటలను విని నవ్వుకుంటుంటే.. మరికొందరు నిజమే అయి ఉంటుందని భావిస్తున్నారు. అయితే గతంలో నటి ఊర్వశి రౌటేలా కూడా అంతర్జాతీయ ప్రముఖులతో తనకు ఉన్న సంబంధాల గురించి చేసిన కామెంట్లను గుర్తుచేసుకుంటూ.. సోషల్ మీడియా వినియోగదారులు దీనిని "ఊర్వశి రౌటేలా సిండ్రోమ్" అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు.

మరోసారి ముంబై అండర్‌వరల్డ్‌లోకి రామ్ గోపాల్ వర్మ!
మరోసారి ముంబై అండర్‌వరల్డ్‌లోకి రామ్ గోపాల్ వర్మ!

ఇక రియాలిటీ షో విషయానికొస్తే.. మొదట్లో 'ది ట్రేటర్స్' షోలో పాల్గొనడానికి మల్లికా షెరావత్ సంకోచించారు. ఓ నటిగా రియాలిటీ షోల పట్ల తనకు పెద్దగా ఆసక్తి లేదని.. కానీ తన మేనేజర్ అంకిత ఒత్తిడితో మొదటి సీజన్ చూసి.. షో కాన్సెప్ట్ నచ్చడంతో ఓకే చెప్పానని వెల్లడించారు. కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న 'ది ట్రేటర్స్ 2' షో ప్రైమ్ వీడియోలో ఆగస్ట్ 13న ప్రీమియర్ కానుంది. ఇందులో 'ట్రేటర్స్', 'ఇన్నోసెంట్స్' అని రెండు గ్రూపులుగా విడిపోయి వ్యూహాలు, మైండ్ గేమ్స్ తో ఆట ఆడాల్సి ఉంటుంది. ఈ రెండో సీజన్లో మల్లికా షెరావత్ తో పాటు మునవర్ ఫారూఖీ, శ్వేతా తివారీ, రియా చక్రవర్తి, అభిషేక్ మల్హన్ వంటి మొత్తం 21 మంది ప్రముఖులు పాల్గొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+