స్కూల్ వాష్‌రూమ్‌లో ఇవేం గలీజు పనులు మాస్టారూ?.. బాలికలను ఒడిలో కూర్చోబెట్టుకుని..!

ఇటీవలి కాలంలో సమాజంలో మహిళలపై దాష్టీకాలకు అంతేలేకుండా పోయింది. రోజురోజుకూ ఇలాంటి ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా కొన్ని మానవ మృగాలు మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాయి. ఆడపిల్ల అయితే చాలు అని మృగాళ్లలా మీదపడిపోతున్నారు. వావి వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్న వారు మరోవైపు ఉన్నారు. తమ కామ వాంఛతో ఎంతోమంది యువతుల కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ఆడవాళ్లు ఒంటరిగా బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోయేలా ప్రవర్తిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. బీహార్లో మాత్రం ఇలాంటి ఘటనలు రోజుకొకటి జరుగుతున్నాయి.

IND vs SL: పసిడి పంచ్‌తో భారత్ అదుర్స్.. శ్రీలంకపై భారీ విజయం!
IND vs SL: పసిడి పంచ్‌తో భారత్ అదుర్స్.. శ్రీలంకపై భారీ విజయం!

బీహార్ రాష్ట్రంలో మహిళలు, మైనర్ బాలికల బాలికల భద్రత దారుణంగా దిగజారిందనడానికి వరుసగా జరుగుతున్న దారుణాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇటీవల బీహార్లోని జముయి జిల్లాలో పదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయిపై రోడ్డుపైనే కొందరు మృగాళ్లు లైంగిక దాడికి యత్నించడం, అడ్డుకోబోయిన ఆమె స్నేహితుడిపై దాడి చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. బాధితులు తమను వదిలేయాలంటూ వేడుకుంటున్నా వినకుండా వేధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి.. రాష్ట్రంలో మహిళల రక్షణ ఎంత ప్రమాదకర స్థితిలో ఉందో స్పష్టం చేశాయి.

Bihar Horror Headmaster Arrested Under POCSO for Assaulting Girls in School Washroom Full Details Here

ఈ ఘటనను మరువక ముందే నవాదా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన హెడ్ మాస్టరే కామాంధుడిగా మారిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాలికల వాష్‌రూమ్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సదరు ప్రధానోపాధ్యాయుడు, వారిని బలవంతంగా ఒడిలో కూర్చోబెట్టుకుని లైంగికంగా వేధించినట్లు విద్యార్థినులు కన్నీరుమున్నీరయ్యారు. బడిలోనే భద్రత లేకుంటే మైనర్ బాలికలు ఎక్కడ సురక్షితంగా ఉంటారంటూ బాధితుల తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల వద్ద తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Viral Video: వీడెవడండీ బాబు. దొంగలకే ఫ్యూజులు ఎగిరిపోయాయి!
Viral Video: వీడెవడండీ బాబు. దొంగలకే ఫ్యూజులు ఎగిరిపోయాయి!

జముయి జిల్లాలో ఓ అమ్మాయిపై లైంగిక దాడి యత్నం, తాజాగా స్కూలు వాష్‌రూమ్‌లోనే బాలికలపై హెడ్మాస్టర్ వేధింపులు.. ఈ రెండు ఘటనలు బీహార్లో పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయో తేటతెల్లం చేస్తున్నాయి. స్కూల్ ఘటనకు సంబంధించి వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైందని తీవ్రస్థాయిలో ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఈ వీడియోను ఎక్స్ వేదికగా పంచుకుంటూ బీహార్లోని బీజేపీ-జేడీయూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైరల్ అయిన ఆ వీడియోలో విద్యార్థినులు ఏడుస్తూ తమ వాష్‌రూంలోకి హెడ్‌మాస్టర్ వచ్చి, తమను బలవంతంగా ఒడిలో కూర్చోబెట్టుకుని వేధించాడని ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+