OYO రూమ్ కి లవర్ తో వచ్చి శవంగా మారి! అర్ధరాత్రి ప్రియుడు ఏం చేశాడు

హైదరాబాద్ ఐటీ హబ్‌ మాదాపూర్‌లో తీవ్ర కలకలం రేగింది. ప్రియుడితో కలిసి ఓయో హోటల్‌ గదిలో దిగిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతదేహాన్ని అత్యవసర చికిత్స పేరుతో ఆస్పత్రికి తీసుకువచ్చిన ప్రియుడు.. ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పడంతో అక్కడికక్కడే ఆస్పత్రి సిబ్బంది కళ్లుగప్పి పారిపోయాడు. ఈ షాకింగ్ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

విశాఖపట్నానికి చెందిన షారన్‌ నిఖిత టోప్నో (23) అనే యువతి తన ప్రియుడు శ్రీనివాస రవితేజతో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మాదాపూర్‌ సిద్ధిఖీ నగర్‌లోని ఓ ఓయో (OYO) హోటల్‌లో గది నంబర్ తీసుకుని చెకిన్ అయ్యారు. అయితే, అంతా బాగుందనుకునే లోపే అర్ధరాత్రి దాటిన తర్వాత కథ అడ్డం తిరిగింది. మంగళవారం వేకువజామున కొండాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి మాదాపూర్ పోలీసులకు ఫోన్ కాల్ రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

Mysterious Death of Young Woman in Hyderabad OYO Hotel Absconding Boyfriend Triggers Police Hunt

ఆస్పత్రికి తెచ్చారు.. చావు వార్త వినగానే పరారయ్యారు!

వేకువజామున తీవ్ర అపస్మారక స్థితిలో ఉన్న నిఖితను ప్రియుడు రవితేజ, హోటల్ సిబ్బంది కలిసి ఆస్పత్రి అత్యవసర విభాగానికి తీసుకువచ్చారు. వెంటనే పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు స్పష్టం చేశారు. యువతి చనిపోయిందనే వార్త వినగానే రవితేజ క్షణాల్లో అక్కడ నుంచి జారుకున్నాడు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా, నిఖిత ముఖం, తలపై తీవ్రమైన గాయాలు, వాపులు ఉన్నట్లు గుర్తించారు.

ఇకపై ఎక్కడపడితే అక్కడ OYO రూములే రూములు
ఇకపై ఎక్కడపడితే అక్కడ OYO రూములే రూములు

గదిలో రక్తపు మరకలు.. హత్యేనా?

పోలీసులు వెంటనే ఘటనా స్థలమైన మాదాపూర్ హోటల్ గదికి వెళ్లారు. అక్కడ దృశ్యాలు చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. గదిలోని గోడలపై, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు స్పష్టంగా కనిపించాయి. రవితేజతో గొడవ జరగడం వల్లే దాడి చేసి హత్య చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వెంటనే క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు, ఇతర కీలక సాక్ష్యాలను సేకరించారు.

గర్భవతి అయిన లవర్ ను చంపి గోనెసంచిలో కుక్కి.. హైదరాబాద్ లో అమానవీయం!
గర్భవతి అయిన లవర్ ను చంపి గోనెసంచిలో కుక్కి.. హైదరాబాద్ లో అమానవీయం!

నిందితుడి కోసం ముమ్మర గాలింపు

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిఖిత మరణానికి అసలు కారణం ఏంటి? ప్రియుడితో గొడవైందా? లేక వేరే ఏదైనా కోణం ఉందా? అనే విషయాలు పోస్టుమార్టం నివేదిక వచ్చాకే స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న రవితేజ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, ఐటీ కారిడార్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ ముమ్మరంగా గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+