ఏపీ, తెలంగాణ మీదుగా తమిళనాడుకు నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌- హాల్ట్ స్టేషన్లు

వివిధ నగరాల మధ్య నెలకొంటోన్న ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటోన్నారు. తరచూ వేర్వేరు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను తరచూ ప్రకటిస్తూ వస్తోన్నారు. తాకిడికి అనుగుణంగా గతంలో ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్లను కూడా పొడిగిస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు అవన్నీ కూడా. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉంటోన్నాయి.

ఈ క్రమంలో ఓ నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కబోతోంది. ఏపీ మీదుగా రాకపోకలు సాగించబోతోంది. దీనికి సంబంధించిన వివరాలు సైతం వెలువడ్డాయి. జార్ఖండ్ లోని ధన్ బాత్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్ మధ్య ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ అందుబాటులోకి రానుంది. మొత్తం అయిదు రాష్ట్రాలు.. బీహార్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలకు మెరుగైన కనెక్టివిటీని కల్పించనుంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన ప్రారంభం కానుంది.

Railways set to Introducing the New Amrit Bharat Express From Dhanbad and Coimbatore From August 15

ఈ నెల 15వ తేదీన శనివారం సాయంత్రం 4:10 నిమిషాలకు ధన్ బాద్ నుంచి బయలుదేరే నంబర్ 22363 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రెండో రోజు అంటే సోమవారం సాయంత్రం 6:30 గంటలకు కోయంబత్తూరుకు చేరుకుంటుంది.

ఈ నెల 18వ తేదీన మంగళవారం ఉదయం 7:50 నిమిషాలకు కోయంబత్తూరు నుంచి బయలుదేరే నంబర్ 22364 అమృత్ భారత్.. రెండో రోజు అంటే గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు ధన్ బాద్ చేరుకుంటుంది.

ఏపీ మీదుగా తమిళనాడు వైపు ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు: బుకింగ్ ఓపెన్
ఏపీ మీదుగా తమిళనాడు వైపు ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు: బుకింగ్ ఓపెన్

గోమా, పరశ్ నాథ్, హజారీబాగ్ రోడ్, కోడెర్మా, గయ, అనుగ్రహ నారాయణ్ రోడ్, డెహ్రి అన్ సోనె, ససారం, బభువా రోడ్, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, మీర్జాపూర్, ప్రయాగ్ రాజ్ ఛెవ్కీ, సత్నా, కత్ని, జబల్ పూర్, నర్సింగ్ పూర్, పిపారియా, ఇటార్సీ, బేతుల్, నాగ్ పూర్, చంద్రాపూర్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుత్తణి, కాట్పాడి, జోలార్ పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్ మీదుగా ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రాకపోకలు సాగిస్తుంది.

సికింద్రాబాద్ నుంచి అరుణాచలం, మధురై స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌- ఏపీలో హాల్ట్ స్టేషన్లు
సికింద్రాబాద్ నుంచి అరుణాచలం, మధురై స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌- ఏపీలో హాల్ట్ స్టేషన్లు
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+