Mirzapur The Movie: మిర్జాపూర్: ది మూవీ ట్రైలర్ రిలీజ్..

కరోనా సమయంలో వచ్చిన ఓటీటీ వెబ్ సిరీస్ లో మిర్జాపూర్ కు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రైమ్ డ్రామా సిరీస్ మిర్జాపూర్.. ఇప్పుడు సినిమాగా తెరకెక్కింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. సెప్టెంబ‌ర్ 04 న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ఈ చిత్రాన్ని అమెజాన్ ఎమ్‌ జీఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్‌ టైన్‌ మెంట్ పతాకాలపై రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి గుర్‌ మీత్ సింగ్ దర్శకత్వం వహించారు. వెబ్ సిరీస్ లో మాదిరిగానే ఈ చిత్రంలోనూ పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందులతో పాటు శ్వేతా త్రిపాఠి, రసికా దుగ్గల్, అభిషేక్ బెనర్జీ, జితేంద్ర కుమార్, రవి కిషన్ తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ తాజాగా విడుదలై యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తోంది.

"సింహాసనం దక్కేది రాజకీయాల ద్వారా కాదు. అటు వంశపారంపర్యం గానూ రాదు.. కేవలం బాహుబలం ఉంటేనే సింహాసనం దక్కుతుంది అనే ప‌వ‌ర్‌ ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. మిర్జాపూర్ సింహాసనం కోసం జరిగే పోరులో కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి), గుడ్డూ పండిట్ (అలీ ఫజల్) అలాగే మున్నా భయ్యా మధ్య జరిగే పోరాటం ట్రైలర్‌ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఇక తాజాగా మిర్జాపూర్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో చిత్ర నిర్మాత ఫర్హాన్ అక్తర్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 2018 లో తాను ఎక్కడికి వెళ్లినా మిర్జాపూర్ సిరీస్ గురించే మాట్లాడుకునేవారని పేర్కొన్నారు. ఈ సీజన్ ​కు ఇంత ఆదరణ దక్కడానికి అభిమానుల ప్రేమే కారణం అని స్పష్టం చేశారు. మొదటి నుంచీ ఈ సిరీస్ ను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారని.. అందుకే ఈ సిరీస్ ను సినిమాగా తీయాలన్న ఆలోచన తమకు వచ్చిందని తెలిపారు.

Mirzapur The Movie trailer released the film is set to premiere worldwide on September 4 release

ఈ సిరీస్ సినిమాలాగా రావాలని కోరుకుంది ప్రేక్షకులేనని అందుకే ఈ సిరీస్ ను అందరికీ నచ్చే విధంగా రూపొందించామన్నారు. ఆయన వ్యాఖ్యలు సినిమాపై మరింత బజ్ ను క్రియేట్ చేశాయి. మొత్తానికి సెప్టెంబర్ 4న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ టార్గెట్ గా ఈ మూవీ థియేటర్లలోకి వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+