Jamui Girl Viral Video: ఏం చిల్లరగాళ్లున్నర్రా బై..! ప్లీజ్.. ప్లీజ్ అని బతిమాలినా వదల్లేదు..!
ఇటీవలి కాలంలో సమాజంలో మహిళలపై దాష్టీకాలకు అంతేలేకుండా పోయింది. రోజురోజుకూ ఇలాంటి ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా కొన్ని మానవ మృగాలు మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాయి. ఆడపిల్ల అయితే చాలు అని మృగాళ్లలా మీదపడిపోతున్నారు. వావి వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్న వారు మరోవైపు ఉన్నారు. తమ కామ వాంఛతో ఎంతోమంది యువతుల కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ఆడవాళ్లు ఒంటరిగా బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోయేలా ప్రవర్తిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా బిహార్ లోని జమూయ్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.
సరదాగా తన ఫ్రెండ్ తో బయటకు వెళ్లిన ఓ మైనర్ బాలికపై కొందరు యువకులు వేధింపులకు పాల్పడ్డారు. వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ, అనుచితంగా తాకడంతో ఆ బాలిక, బాలుడు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీడియోలో కనిపించిన 6-7 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన సెప్టెంబర్ 19, 2026 శనివారం సాయంత్రం జరిగినట్లు తెలుస్తోంది. జమూయ్ జిల్లాలోని జమూయ్- లఖిసరాయ్ రోడ్డు వెంబడి ఈ దారుణమైన ఘటన జరిగినట్లు స్పష్టం అవుతోంది. ఈ ఘటన బిహార్ లో రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది.

అధికార బీజేపీ- జేడీయూ అలాగే ప్రతిపక్ష జేడీయూ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ఈ ఘటనపై జమూయ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశ్వజిత్ దయాల్ మాట్లాడుతూ.. " ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సూమోటోగా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. బాధితురాలైన మైనర్ బాలిక.. ఆమె ఫ్రెండ్ ను కలిసి వివరాలు తెలుసుకున్నాం. వాళ్లిద్దరూ కోచింగ్ ను ముగించుకుని హిల్ సైడ్ ఏరియా నుంచి తిరిగి వస్తుండగా కొందరు దుండగులు వారిని అడ్డుకుని వేధింపులకు పాల్పడ్డారు. ఎక్కడపడితే అక్కడ తాకుతూ బాలికను ఇబ్బంది పెట్టారు. నిందితుల్లో సగం మంది మాస్కులు ధరించి ఉన్నారు. ఈ ఘటనపై సెప్టెంబర్ 20 న ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. వీడియోలో కనిపించిన అందరినీ కస్టడీలోకి తీసుకున్నాం. మరికొంతమందిని అరెస్ట్ చేశాం" అని అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications
