గోదావరిలో వైసీపీకి ముఖ్య నేత గుడ్ బై - జనసేనలోకి ఎంట్రీ..!!

ఏపీలో స్థానిక ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేతలు పార్టీలు మారుతున్నారు. వైసీపీ నుంచి కొద్ది రోజుల క్రితం విజయనగరం జిల్లాలో మజ్జి శ్రీను టీడీపీలో చేరగా ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో మరో కీలక నేత పార్టీ వీడారు. పవన్ సమక్షంలో జనసేనలో చేరాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికల్లో కూటమికి గట్టి పోటీ ఇవ్వాలని మాజీ సీఎం జగన్ పార్టీ నేతలకు చెబుతున్న సమయంలో నేతలు వరుసగా పార్టీ వీడుతున్నారు. కాగా.. ఈ పరిణామాలు రాజకీయంగా కీలకంగా మారుతున్నాయి.

వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికలను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వేళ ముఖ్య నేత పార్టీని వీడి జనసేనలో చేరేందుకు సిద్దమయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ నేత మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. త్వరలోనే ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు వెల్లడించారు. కొద్ది రోజులుగా సుబ్బారావు పార్టీ వీడటం పైన చర్చ జరుగుతోంది. జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో వరుపుల సుబ్బారావు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ కాపు సామాజికవర్గ నేత. 2004లో కాంగ్రెస్ నుంచి, 2014లో వైసీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జనసేనలో చేరటం పైన ఇప్పటికే తన మద్దతు దారులతో చర్చించారు.

మనోహర్ వ్యాఖ్యలతో కేడర్ ఆగ్రహం వేళ పవన్ అనూహ్య నిర్ణయం..!!
మనోహర్ వ్యాఖ్యలతో కేడర్ ఆగ్రహం వేళ పవన్ అనూహ్య నిర్ణయం..!!
ysrcp-prathipadu-in-charge-varupula-subba-rao-to-join-in-janasena-ahead-local-body-elections

స్థానిక ఎన్నికల వేళ మారుతున్న సమీకరణాలు

సుబ్బారావుతో పాటుగా పలువురు కార్యకర్తలు సైతం జనసేన కండువా కప్పుకునేందుకు సిద్దం అయ్యారు. నియోజకవర్గ పరిధిలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి మండలాల్లో ఆయనకు పట్టు ఉంది. ప్రస్తుతం నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇప్పుడు సుబ్బారావు జనసేనలో చేరనుండటం స్థానిక సమీకరణాల్లో కీలక పరిణామంగా మారింది. అయితే.. స్థానిక ఎన్నికల వేళ ఇది వైసీపీకి షాకింగ్ పరిణామంగా నే భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి ఈ జిల్లాల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. స్థానిక ఎన్నికల వేళ.. పట్టు పెంచుకునేందుకు కార్యాచరణ సమాయత్తం చేస్తున్న వేళ సుబ్బారావు పార్టీని వీడటం తో నష్టం తప్పదనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+