తేనె లేదా బెల్లమా?.. షుగరు బాధితులకు ఈ రెండింట్లో ఏది బెటర్..!?
షుగరు బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. మారుతున్న జీవన శైలి కారణంగా ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. షుగరు బాధితులు ఆహారం నుంచి జీవన శైలి వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. మధుమేహం ఉన్న వ్యక్తి శరీరంలో ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనూ షుగరు వ్యాధి బారిన పడుతున్న వారు ఎక్కువగా ఉంటున్నారు. దీంతో.. షుగరు బాధితులు పంచదార తినకూడదు. అదే సమయంలో వారికి తేనె - బెల్లం ఈ రెండింట్లో ఏద బెటర్ అనేది నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
షుగరు వ్యాధి ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వేధిస్తోంది. షుగరు వచ్చిన వారు ఆహారం తో పాటుగా జీవన శైలిలోనూ నియంత్రణ అవసరం. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిక్ రోగులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని మాత్రమే ఆహారంలో చేర్చుకోవాలి. తీపి పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సలహా ఇస్తారు. తీపి పదార్థాలు డయాబెటిక్ రోగులకు విషం లాంటివి, ఇది వారికి చాలా హాని కలిగిస్తుంది. షుగరు ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచదార వినియోగించకూడదు. ఆరోగ్యకరమైన చక్కెర ప్రత్యామ్నాయాల గురించి భిన్నాభి ప్రాయాలు ఉన్నాయి. అందులో బెల్లం, తేనె ఉత్తమ ఎంపికలుగా పరిగణిస్తున్నారు. తేనె ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. తేనెలో గ్లైసెమిక్ ఇండెక్స్(GI) సాధారణ చక్కెర కంటే కొంచెం తక్కువగా ఉంటుంది(సుమారు 50-60). అయినప్పటికీ, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతుంది. అయితే, తేనె సాధారణ చక్కెర కంటే రక్తంలో షుగర్ లెవెల్స్‌ను త్వరగా పెరిగేలా చేయదు.

నిపుణుల సూచనలు
కాగా, తేనెలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మధుమేహం వల్ల వచ్చే సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అదే విధంగా పంచదారకు బదులుగా బెల్లం వాడటం మంచిది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు B1, B6, C పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థకు మంచిది. అయితే.. సాధారణ వ్యక్తులు కూడా చక్కెర కంటే బెల్లం లేదా తేనె తీసుకోవడం మంచిది. డయాబెటిక్ రోగులు బెల్లం తీసుకోవడం మంచిదనే అభిప్రాయం ఉంది. అయితే.. సాధారణంగా, వీరు బెల్లం వాడకానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే చక్కెర, బెల్లం తయారీకి మూలం ఒకటే. చెరకు నుండి పంచదార , బెల్లం రెండూ తయారవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో బెల్లం తీసుకోవడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. బెల్లం బదులుగా తేనె తీసుకోవడం మధుమేహ రోగికి చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాగా.. ఈ రెండిట్లో ఏది వినయోగించాలనేది షుగరు బాధితుల వైద్య సాయం మేరకు తీసుకుంటే ఉత్తమం.













Click it and Unblock the Notifications