ISRO: శ్రీహరికోటకు పోటీగా మరో స్పేస్‌పోర్ట్! రూ.950 కోట్ల ప్రాజెక్ట్ ప్రైవేట్ పరం

భారత అంతరిక్ష పరిశోధన రంగంలో అపూర్వమైన విప్లవానికి నాంది పడింది. ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కలిగిన కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తమిళనాడులోని కులశేఖరపట్నంలో సుమారు రూ.950 కోట్ల వ్యయంతో ఇస్రో వేగంగా నిర్మిస్తున్న స్మాల్ శాటిలైట్ లాంచ్ కాంప్లెక్స్ (SLC) నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ప్రైవేటు కంపెనీలకు అప్పగించనుంది.

దీనికి సంబంధించి భారత జాతీయ అంతరిక్ష ప్రమోషన్ , ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ (EOI) దరఖాస్తులను ఆహ్వానించింది. అంతరిక్ష విపణిలో భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టేందుకు 2023 స్పేస్ పాలసీ కింద ఈ కీలక అడుగు పడింది.

ISRO Second Spaceport in Kulasekarapattinam to be Managed by Private Sector Invites IN SPACe Bids

శ్రీహరికోట కంటే ఇది ఎందుకు ప్రత్యేకం?

చిన్న రకం ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్లతో పాటు స్కైరూట్, అగ్నికుల్ వంటి ప్రైవేట్ కంపెనీల రాకెట్ ప్రయోగాల కోసం ప్రత్యేకంగా ఈ స్పేస్‌పోర్ట్‌ను నిర్మిస్తున్నారు. శ్రీహరికోట నుంచి దక్షిణ దిశగా రాకెట్ ప్రయోగించినప్పుడు శ్రీలంక మీదుగా వెళ్లకుండా 'డాగ్‌లెగ్' మలుపు తిరగాల్సి వచ్చేది.

దీనివల్ల ఎక్కువ ఇంధనం ఖర్చయ్యేది. కానీ, తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉన్న కులశేఖరపట్నం నుంచి ప్రయోగిస్తే నేరుగా అడ్డంకులు లేకుండా దక్షిణ ధ్రువం వైపు రాకెట్లను పంపవచ్చు. దీనివల్ల భారీగా ఇంధనం కలిసి రావడమే కాకుండా, రాకెట్ మోసుకెళ్లే పేలోడ్ సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుంది.

చంద్రుడిపై బేస్ స్టేషన్ + అంతరిక్ష పరిశోధన కేంద్రం: నాసా పార్ట్‌నర్ గా ఇస్రో.. !!
చంద్రుడిపై బేస్ స్టేషన్ + అంతరిక్ష పరిశోధన కేంద్రం: నాసా పార్ట్‌నర్ గా ఇస్రో.. !!

ఎవరికి దక్కుతుంది ఈ అవకాశం?: కఠిన నిబంధనలు

ఈ భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్వహించే కంపెనీల ఎంపిక కోసం ఇన్-స్పేస్ అత్యంత కఠినమైన అర్హతలను విధించింది.

  • కేవలం భారత్‌లోనే రిజిస్టర్ అయి, కనీసం ఏడేళ్ల అనుభవం ఉన్న స్వదేశీ ప్రైవేట్ దిగ్గజాలకు మాత్రమే ఇందులో అవకాశం
  • గత ఏడేళ్ల కాలంలో కనీసం రూ.3,500 కోట్ల విలువైన పెద్ద తరహా మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టిన అనుభవం
  • గత ఐదేళ్లలో కనీసం రూ.2,000 కోట్ల సగటు వార్షిక టర్నోవర్ కలిగి ఉండాలి.
  • కనీసం రూ.1,000 కోట్ల నికర విలువ ఉన్న దిగ్గజ కంపెనీలు మాత్రమే ఈ రేసులో పోటీపడటానికి అర్హులు.
108 దేశాల పోటీని దాటుకుని.. ఇస్రో కల వైపు ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని
108 దేశాల పోటీని దాటుకుని.. ఇస్రో కల వైపు ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని

టెక్నికల్ సపోర్ట్ ఇచ్చే బాధ్యత ఇస్రోదే: నిరంతర సహకారం!

ఎంపికైన ప్రైవేట్ సంస్థకు ప్రారంభంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇస్రో స్వయంగా సాంకేతిక శిక్షణ, కార్యాచరణ సహకారాన్ని అందిస్తుంది. సదరు సంస్థ వరుసగా మూడు విజయవంతమైన ప్రయోగాలు పూర్తి చేసే వరకు లేదా ఒక సంవత్సరం కాలం పాటు ఇస్రో సైంటిస్టులు దగ్గరుండి మార్గదర్శకత్వం వహిస్తారు. రాకెట్ ప్రయోగాల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడం ద్వారా, ఇస్రో తన దృష్టిని మరింత సంక్లిష్టమైన గ్రహాంతర ప్రయోగాలు, కీలకమైన అంతరిక్ష పరిశోధనలపై కేంద్రీకరించే అవకాశం లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+