జెకెఎల్‌ఎఫ్ నేతఅరెస్టు
న్యూఢిల్లీః హురియత్ నేత జెకెఎల్‌ఎఫ్ అధినాయకుడు యాసిన్ మాలిక్‌ను సోమవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్ నాలుగు వరకు ఆయన్ను జుడిషియల్ కస్టడిలో వుంచాల్సిందిగా ఢిల్లీ న్యాయస్థానం ఆదేశించింది.
టాడా కేసులో నిందితునిగా వున్న యాసిన్ మాలిక్ వరసగా రెండు రోజుల పాటు కోర్టుకు హాజరుకాకపోవడంతోస్పెషల్ జడ్జ్ వికె జైన్ దానిని కోర్టు ధిక్కారంగాపేర్కొంటూ యాసిన్ మాలిక్ అరెస్టుకు ఆదేశాలు జారీ చేశారు.అరెస్టు తర్వాత ఆయన్ను సెప్టెంబర్ నాలుగు వరకు జుడిషియల్ రిమాండ్‌లో వుంచాల్సిందిగా ఆదేశించారు.












Click it and Unblock the Notifications