నిజామాబాద్ లో ఎనిమిదిమంది జలసమాధి
నిజామాబాద్‌ః పంచాయతీ ఎన్నికల్లో ఓటు చేసేందుకు వెళుతున్న ఎనిమిది మంది ప్రమాద వశాత్తు వాగులో పడి జల సమాధి అయ్యారు. నిజమాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలంలో జంగాపూర్ వద్ద మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. సుమారు 20 మంది మంగళవారం ఉదయం ట్రాక్టర్ లో పోలింగ్ బూత్ కు బయలు దేరారు. భోరున వర్షం కురుస్తుండడంతో వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ప్రమాద వశాత్తు వాగులో పడింది. ట్రాక్టర్ డ్రైవర్ ప్రాణాలతో పాటు 12 మంది తప్పించుకోగామిగిలిన వారు జలసమాధి అయ్యారు. జలసమాధిఅయిన వారిలో ఆరుగురు మహిళలు, ఒక పసిపాప వున్నారు.
వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో మృతదేహాల కోసం గాలింపు చర్యలకు అవాంతరం ఏర్పడింది. ఈ దుర్ఘటనతో పిట్ల మండలంలోవిషాద ఛాయలు అలముకున్నాయి.












Click it and Unblock the Notifications