పనికిమాలిన బాంకులు బంద్‌ః ప్రధాని
న్యూఢిల్లీః రాజకీయాలకు, అవినీతికి దూరంగా వుంచినప్పుడే దేశంలో సహకార బాంకింగ్ రంగం బతికి బట్టకడుతుందని ప్రధాని అటల్‌బిహారీ వాజ్ పేయి అభిప్రాయపడ్డారు. సహకార రంగాన్ని మరింత సమర్థంగా నిర్వహించాలని, కఠినమైన ఆంక్షలు విధించాలని శనివారం కొత్తఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సదస్సులో ప్రధానికోరారు.
ఆంధ్రప్రదేశ్ తో సహా పలు రాష్ట్రాలలో సహకార బ్యాంక్ లు ప్రజల కష్టార్జితాన్నిస్వాహా చేస్తున్న తరుణంలో ఈ ముఖ్యమంత్రులు సమావేశం ఎంతగానో ప్రాధాన్యత సంతరించుకున్నది. సాధ్యమైనంత త్వరగా కఠినమైన ఆంక్షలను అమలు చేసినప్పుడే సహకార బాంక్ లు ప్రజల ను మోసం చేసే సంస్థలుగా కాకుండా....దేశ ఆర్థిక రంగం అభివృద్ధికి పాటుపడే సంస్థలుగా పేరుతెచ్చుకోగలుకుతాయని ప్రధాని చెప్పారు.
బాగుపడే అవకాశాలులేవనుకున్న సహకార బ్యాంకులను వెంటనే మూసెయ్యాల్సిందిగా ఆయన తేల్చి చెప్పారు. కోలుకొనే అవకాశాలు లేవనుకున్న బాంక్ లను ఇంకా నెత్తినపెట్టుకొని భరించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. సహకార బ్యాంకులను మొక్కుబడిగా కాకుండా కట్టుదిట్టంగా నిర్వహించగలిగినప్పుడే దేశ ఆర్ధికాభివృద్ధికి అవి తోడ్పడతాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications