శ్రీలంకపై భారత్ ఘనవిజయం
కాండీః బౌలర్ల ప్రతిభతో శ్రీలంక ను తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగిన భారత్ కాండీటెస్ట్ లో ఘనవిజయం సాధించింది. 264 పరుగులవిజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ శనివారం రమేష్, రాహుల్ ద్రావిడ్‌వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని సాధించింది. రాహుల్ ద్రావిడ్ చక్కగా ఆడి 75 పరుగులు చేశాడు. మొదటి నుంచి పాజిటివ్‌గేమ్ ఆడి భారత్ ఆశలకు ద్రావిడ్ పునాదులు వేశాడు. శ్రీలంక బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ చక్కని బ్యాటింగ్ ప్రతిభను కనబరిచాడు.
శ్రీలంకటెస్ట్ సిరీస్ లో ఏ మాత్రం పరుగులు చేయలేని సౌరభ్ గంగూలీ అద్భుతంగా ఆడి 98 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 14 ఫోర్లతో శ్రీలంక బౌలర్లను చీల్చి చెండాడిన గంగూలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఇప్పటికే శ్రీలంక ఒక మ్యాచ్ గెలుచుకుంది. కాండీ లో భారత్ గెలుపొందడంతో సిరీస్ లో చెరొక మ్యాచ్ గెలుచుకొని సమఉజ్జీలుగా నిలిచారు. ఈ నెల 29నుంచి కొలంబోలో ప్రారంభమయ్యే మూడోది, చివరిటెస్ట్ రసవత్తరంగా సాగే అవకాశం వుంది.












Click it and Unblock the Notifications