అరటి ఆకులో భోజనం వెనుక ఆరోగ్య రహస్యం, ఊహించని ఫలితాలు..!!
అరటి ఆకు భోజనం. ఈ సాంప్రదాయ పద్ధతి శతాబ్దాలుగా ఉంది. ఆధునిక జీవన శైలిలో కొత్త సమస్యలు తిరిగి సంప్రదాయం వైపు చూస్తున్నాయి. ఈ మధ్య కాలంలో తిరిగి అరటి ఆకు భోజనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అరటి ఆకులో భోజనం అనేది కేవలం సంప్రదాయమే కాదు.. శాస్త్రీయ కారణాల నుంచి జెనెటిక్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గ్రీన్ టీ లాగే అరటి ఆకులో కూడా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అంతేకాదు, యాంటీ బ్యాక్టీరియల్ కూడా అని చెబుతున్నారు. అరటి ఆకులో భోజనం పైన నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.
అరటాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలను హరిస్తాయని చాలా అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. అరటి ఆకు మనం తినకపోవచ్చు కానీ తాజా అరటాకులో వేడివేడి పదార్థాలు తినడం వల్ల ఇవి మన శరీరంలో చేరుతాయి. అరటి ఆకులలో పాలీఫెనాల్స్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. అరటి ఆకుపై ఆహారాన్ని ఉంచినప్పుడు, ఈ పోషకాలలో కొన్ని ఆహారానికి బదిలీ అవుతాయి. అలా మీరు తినే ఆహారం పోషక విలువను పెంచుతుంది. అరటాకు మీద పలుచని మైనపు పొర సహజంగా ఉంటుంది. వేడివేడి పదార్థాలు వడ్డించినపుడు అది కరుగుతుంది. అలా కరిగినపుడు కమ్మని వాసన వెలువడుతుంది. ఇది ఆహార పదార్థాలకు ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ ను ఇస్తుంది. అరటి ఆకులో ఆహారం తీసుకుంటే ఆహారం రుచి పెరుగుతుంది.

సంప్రదాయమే కాదు.. ఆరోగ్య పరంగా ప్రయోజనం
అరటి ఆకులు ఆహారానికి తేలికపాటి, మట్టి రుచిని అందిస్తాయి. ఇది ఆహారం రుచిని పెంచుతుంది. అరటి ఆకులపై ఆహారం తీసుకోవడం వల్ల ఆహారానికి సంప్రదాయ ఆకర్షణ లభిస్తుంది. ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. అరటి ఆకులు ప్లాస్టిక్ లేదా థర్మాకోల్ ప్లేట్‌లతో పోలిస్తే విషపూరితం కాదు, కాబట్టి హానికరమైన రసాయనాలు ఆహారంలో చేరవు. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అరటి ఆకులపై ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై సానుకూల ప్రభావం ఉంటుంది. అరటి ఆకులలో ఉండే పాలీఫెనాల్స్ జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచుతాయి. ఇవి మంచి జీర్ణక్రియ, పోషకాలను గ్రహించడంలో సహాయపడతాయి. అరటి ఆకులలో సహజ యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఆహారంలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో.. అరటి ఆకులో భోజనం వెనుక ఆరోగ్య పరమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.













Click it and Unblock the Notifications