హార్డ్‌వేర్ పాలసీలో అనేక రాయితీలు
హైదరాబాద్‌ః రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ కంప్యూటర్ విడిభాగాలను తయారు చేసే కంపెనీలను ప్రొత్సహించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పాలసీని ప్రవేశపెట్టింది. శుక్రవారం గ్రాండ్ కాకతీయ హోటల్‌లో ప్రారంభమైన అడ్వాంటేజ్ హార్డ్‌వేర్ సదస్సులో ఈ కొత్త పాలసీని ముఖ్యమంత్రి ప్రకటించారు.
అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో హార్డ్‌వేర్ పార్క్ నిర్మాణానికి ప్రభుత్వం 5000 ఎకరాల స్థలాన్ని గుర్తించిందని అందులో 100 ఎకరాల స్థలంలో హార్డ్‌వేర్ పరిశ్రమల స్థాపనకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. రాష్ట్రంలో హార్డ్‌వేర్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు ఈ విధంగా వున్నాయి.
1 హార్డ్‌వేర్ పరిశ్రమలకు విద్యుత్ కోత వుండదు.
2 పారిశ్రామిక వాడల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసేహార్డ్‌వేర్ పరిశ్రమలు మౌలిక సదుపాయాల కల్పనకు చేసే
ఖర్చులో 25 శాతాన్ని (కోటి రూపాయల గరిష్ట పరిమితికి లోబడి) ప్రభుత్వం భరిస్తుంది.
3 చిన్న పరిశ్రమలకు కాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌లో 20 శాతం( 20 లక్షల రూపాయల వరకు) సబ్సిడీ ఇస్తారు.
4 స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల్లో 50 శాతం రాయితీలు వుంటాయి.
5 500 కోట్ల రూపాయల పైబడిన వ్యయంతో ఏర్పాటయ్యే మెగా ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇస్తుంది.
హార్డ్‌వేర్ రంగం మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్న నిధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 50 కోట్ల రూపాయలను సమకూర్చింది. ఈ నిధిని మరింత విస్తరిస్తారు. కొత్త పార్క్‌లో 50 కోట్లతో పరిశ్రమ స్థాపనకు విడియోకాన్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది.












Click it and Unblock the Notifications