ఢిల్లీకి సోకినకృషి మంటలు
న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృషి బ్యాంక్ నిర్వాకం ఢిల్లీని కూడా ఒక కుదుపు కుదిపింది. బ్యాంకు కుంభకోణంలో దెబ్బతిన్న చిన్న పెట్టుబడిదారులు, ఇతరుల ప్రయోజనాలు పరిరక్షిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా విలేకరుల సమావేశంలో చెప్పారు. శుక్రవారం నాడు తనను కలసిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు.
కృషి బ్యాంకు కుంభకోణం గురించి దత్తాత్రేయ ఆర్ధిక మంత్రికివివరించారు. రిజర్వ్ బ్యాంకునుంచి పూర్తి వివరాలు తెలుసుకోనున్నట్టుగా మంత్రి హామీ ఇచ్చారు. చాలా నగరాల్లో కొత్తఅర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకులు ప్రారంభించాలని తనపై అనేకరకాలైన వత్తిళ్లు వచ్చాయని అయితే తానుఅంగీకరించలేదని మంత్రి తెలిపారు. అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి వివిధఅంశాలను చర్చించేందుకు శనివారం నాడు ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసినట్టు కూడా ఆయన చెప్పారు. ఇలాంటి భారీ కుంభకోణాలు జరిగినప్పుడు ఆస్తులు జప్తు చేయాలనే డిమాండ్‌ను ప్రస్తావిస్తూ ప్రస్తుత చట్టాల ప్రకారం ఆస్తుల జప్తు అతి సుదీర్ఘమైన ప్రక్రియ అనిచెప్పారు.
మూడు కోట్లతో చైర్మన్ పరార్
దేవాదాయశాఖ డిపాజిట్ కోటి
మావాడికే పాపమూ తెలియదు
కృషిమాజీ చైర్మన్ ఆస్తుల జప్తు
పట్టుకుంటేఅయిదు లక్షలు
కృషిడిపాజిట్లకు బీమా లేదు












Click it and Unblock the Notifications