మూడు కోట్లతో చైర్మన్ పరార్
హైదరాబాద్‌ః కృషి బ్యాంకును నిండాముంచడానికి కొద్ది వారాల ముందుగా చైర్మన్ వెంకటేశ్వరరావు అప్పటికి బ్యాంకులో మిగిలి వున్న మూడు కోట్ల రూపాయలను పెట్టెలో సర్ధుకుని పరారయినట్టుగా చెబుతున్నారు.
ఇప్పుడు ఆ మూడు కోట్లతోనే వెంకటేశ్వరరావు ఎక్కడో జల్సా చేస్తువుండివుంటారని పోలీసులుఅంటున్నారు. కుంభకోణం విషయం బయటపడిన వెంటనే వెంకటేశ్వరరావును పోలీసులుఅరెస్టు చేయగలిగివుంటే ఈ మూడు కోట్లలో ఎంతో కొంత దక్కేది. రోజులు గడుస్తున్నా కొద్ది ఈ సొమ్మును రాబట్టుకోవడం అసాధ్యమనిఅంటున్నారు. నెల రోజుల క్రితం కృషి డిపాజిట్లు సుమారు 60 కోట్ల రూపాయల మేరకు వున్నాయనిఅందులో సుమారు 30 కోట్ల రూపాయలను చార్మినార్ కో ఆపరేటివ్ బ్యాంక్, మరో రెండు సహకార బ్యాంకులు డ్రా చేసుకున్నాయని అధికారులుఅంటున్నారు. ఆలస్యంగానైనా ప్రారంభమైన ఆర్‌బిఐ ఆడిటింగ్‌లోఅసలు వ్యవహారాలు పూర్తిగా బయటపడే అవకాశం వున్నదని చెబుతున్నారు. పంజాగుట్టలోని జిఎంస్ చాంబర్స్‌లో 6750 చదరపు అడుగుల స్థలాన్ని వెంకటేశ్వరరావు కొన్నట్టుగా చెబుతున్నారు. ఈ స్థలంవిలువ సుమారు 70 లక్షల రూపాయలమేర వుంటుంది.
ఢిల్లీకి సోకిన కృషి మంటలు












Click it and Unblock the Notifications