హైదరాబాద్‌కు ఫోర్జరీ లేఖ
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణపైవివాదానికి కారణమైన లేఖను పరీక్ష నిమిత్తం హైదరాబాద్‌లోనిసెంటర్ ఫర్ ఫోరెన్సిక్ అండ్ సైంటిఫిక్ లేబరేటరీ(సిఎఫ్‌ఎస్‌ఎల్) కి పంపుతున్నారు. ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణను వ్యతిరేకిస్తూ కేబినెట్ కార్యదర్శి టి.ఆర్. ప్రసాద్ ప్రధాని కార్యాలయానికి రాశారంటున్న లేఖవివాదానికి కారణమైంది. ఇది ఫోర్జరీ లేఖ అని ప్రభుత్వం వాదిస్తోంది. దస్తూరీని పరీక్షించేందుకు ఆ లేఖను నిపుణులకు పంపుతున్నారు.
పెట్టుబడుల ఉపసంహరణను వ్యతిరేకిస్తూ కేబినెట్ కార్యదర్శి టి.ఆర్. ప్రసాద్ లేఖ రాశారంటూ కాంగ్రెస్ సభ్యుడు ప్రియరంజన్ దాస్ మున్షీ తొలుతవిమర్శించారు. దీనిపై పార్లమెంటులో వివాదం చెలరేగింది. దీనిపైవిచారణకు ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది.












Click it and Unblock the Notifications