పరువు దక్కించిన పంచాయతీ
హైదరాబాద్‌ః ప్రాదేశీక నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి బాగా మెరుగుపడిందని దేశం అధికార ప్రతినిధి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం నాడు నగరంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల తెలుగుదేశం పార్టీ కార్యవర్గాల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ఈ మూడు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలుహాజరయ్యారు. ప్రాదేశీక ఎన్నికల్లో ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సాధించినవిజయాలు, అపజయాలపై సమావేశం సమీక్ష జరిపింది. ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపోటములపై ప్రభావం చూపిన విభిన్నఅంశాలపై కూలంకషంగా చర్చ జరిపారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల సమీక్ష సమావేశాలను ఈ విధంగానే జరిపి చివరగా నియోజకవర్గాల వారిగా కూడా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనివల్ల రానున్నఅసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ అట్టడుగుస్థాయినుంచి బలోపేతం అవుతుందని పార్టీ నేతలుఅంటున్నారు.












Click it and Unblock the Notifications