రాజకీయాలకు దూరంగాసహకారం

న్యూఢిల్లీ: సహకార రంగాన్ని రాజకీయాలకు దూరంగా వుంచాలని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ముఖ్యమంత్రులను కోరారు. ఆయన శనివారం ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రసంగించారు. అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఆయన అన్నారు. నష్టాల్లో నడుస్తున్న సహకార పరపతి సంఘాలను పునరుద్ధరించడానికి ప్రయత్నించాలని, పునరుద్ధరణ సాధ్యం కాకపోతే మూసేయడానికి వెనుకాడ కూడదని ఆయన ముఖ్యమంత్రులకు సూచించారు. సహకార రంగంలో తగిన మార్పులు తెస్తామని ఆయన చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి సాధనకు, జీవన ప్రమాణాలను పెంచడానికి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం వుందని ఆయన చెప్పారు.స్వయం సమృద్ధి సూత్రాలను, అభివృద్ధిలో ప్రజాభాగస్వామ్యాన్ని అనుభవంలోకి తేవడంలో సహకార పరపతి సంఘాలు కీలక పాత్ర పోషించాయని ఆయన కొనియాడారు. భారతదేశంలో వ్యవసాయాభివృద్ధికి, సహకార ఉద్యమానికి మధ్య విడదీయరాని సంబంధంపెనవేసుకుని పోయిందని ఆయన చెప్పారు.

గ్రామీణాభివృద్ధిలో సహకార పరపతి సంఘాలువిశిష్టమైన పాత్ర పోషించాయని, అన్ని రకాలుగా మన దేశ సహకార పరపతి వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దదని ఆయన అన్నారు.
ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు.

సహకార పరపతి సంఘాలపై రాష్ట్రాల నియంత్రణను తగ్గించాలనుకుంటే గందరగోళం ఏర్పడుతుందని పలువురు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+