తెహల్కాపై దర్యాప్తునకు ప్రధాని విముఖత
న్యూఢిల్లీః తెహల్కాపై ప్రభుత్వం చొరవతీసుకుని దర్యాప్తు చేసి తెహల్కా ఎడిటర్ ఇన్ ఛీప్ తరుణ్ తేజ్‌పాల్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని పట్టుదలతో వున్న ఎన్‌డిఎ కన్వీనర్, సమతాపార్టీ నేత జార్జ్ ఫెర్నాండెజ్‌కు ప్రధాని వాజ్‌పేయి నుంచి చుక్కెదురయింది.
అధికారాన్నివినియోగించి తెహల్కాపై ఎలాంటి చర్య తీసుకున్నాఅది తమ పీకలకే చుట్టుకునే ప్రమాదంవున్నదని ప్రధాని వాజ్‌పేయి అభిప్రాయపడుతున్నట్టుగాతెలిసింది. తెహల్కా చర్యలను రాజకీయస్థాయిలోనే ఎండగట్టాలన్నది వాజ్‌పేయి విధానంగావున్నదని చెబుతున్నారు. ఇప్పటికే తెహల్కావ్యవహారంపై వెంకటస్వామి కమిషన్ విచారణకుఆదేశించినందున ఇందులో జోక్యం చేసుకోకపోవడమేమంచిదని ప్రధాని అంటున్నారు.
ఇదిలావుండగా ప్రభుత్వం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినాతెహల్కా ఎడిటర్‌పై కేసు పెట్టే ఆలోచనలోజార్జ్ వున్నారని అంటున్నారు. సైనికాధికారులనులొంగదీసుకోవడం కోసం వేశ్యలను పంపడంద్వారా సిటా చట్టాన్ని తెహల్కా ఉల్లంఘించిందనిదీనిపైనే ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయవచ్చని సమతవర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications