రూ.10 వేల కోట్ల యోజన: వెంకయ్య
హైదరాబాద్: దేశంలో పది వేల కోట్ల రూపాయలతో సంపూర్ణ రోజ్‌గార్ యోజనను అమలు చేయనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. ఇందులో ఐదు వేల కోట్ల రూపాయలతో ఆహార ధాన్యాలనుఅందించినున్నట్లు, మిగతా ఐదు కోట్ల రూపాయలు నగదు రూపంలో ఇవ్వనున్నట్లు ఆయన శనివారంవిలేకరుల సమావేశంలో చెప్పారు.
వివిధ గ్రామీణాభివృద్ధి పథకాలను సంపూర్ణ రోజ్‌గార్ యోజన కింద సమీకృతం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం కిందపెద్ద యెత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. అంతేకాకుండా సహజ సిద్ధమైన చెరువులను, ఇతర నీటి పారుదల వనరులను అభివృద్ధి పరుస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications