ఉయ్యూరులో సారథి-సిద్ధిపేటలో ఎల్లయ్య
హైదరాబాద్: రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులుగా ఉయ్యూరులోకె.పి. సారథిని, సిద్ధిపేటలో నంది ఎల్లయ్యను రంగంలోకి దించాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఉయ్యూరులోసీనియర్ నేత కె. రోశయ్యను పోటీకి దించాలని పిసిసి భావించింది. అయితే రోశయ్యఅందుకు విముఖత ప్రదర్శించడంతో కె.పి. సారథిని పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సిద్ధిపేట నుంచి పోటీ చేయాలని నంది ఎల్లయ్యను ఒప్పించేందుకు రాష్ట్ర నాయకులు ప్రయత్నిస్తున్నారు.వీరిద్దరి పేర్లను పిసిసి లాంఛనంగా ఖరారు చేస్తుందనిఅంటున్నారు. వీరిద్ధిరి పేర్లకు ఎఐసిసి ఆమోద ముద్ర వేయించుకోవడానికి పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు.
ఎన్నికల్లో వామపక్షాల సహకారం తీసుకుంటామని పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణ రావు చెప్పారు. కరువు, విద్యుత్ ఛార్జీలపెంపును ఎన్నికల్లో ప్రచారానికి వాడుకుంటామని ఆయన చెప్పారు. సిద్ధిపేటలో కాంగ్రెస్ పోటీ నామమాత్రమేనని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తాము సిద్ధిపేటలోసీరియస్‌గానే పోటీ చేస్తామని, అందుకు నంది ఎల్లయ్య అభ్యర్థి అయితే బాగుంటుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.
ఇదిలా వుంటే, తెలుగుదేశం పార్టీ ఇంకా తన అభ్యర్థులను ఖరారు చేయలేదు. దివంగత శాసనసభ్యుడు అన్దే బాబూరావు కుటుంబ సభ్యులకే ఉయ్యూరు టికెట్ ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. సిద్ధిపేటలోసరైన అభ్యర్థి కోసం తెలుగుదేశం అన్వేషణ ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పోటీకి దిగుతున్నారు. ఆయన ఈ నెల 30వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తారు.












Click it and Unblock the Notifications