పదివేల ఐటి ఉద్యోగాలు హుష్‌కాకి...
న్యూఢిల్లీః ఐటి రంగంలో పొడసూపిన మాంద్యం వల్ల గత ఏడాది కాలంలోనే ఐటి రంగంలో సుమారు పదివేల ఉద్యోగాలు మాయం అయినట్టుగా నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాల కోతలో 80 శాతం మేర సాఫ్ట్‌వేర్ సర్వీసుల రంగంలో వున్నదని ఈ వర్గాలు చెబుతున్నాయి. ఐటితో కోట్లాది ఉద్యోగాలు పుట్టుకురావడం ఖాయమని పాలకులు హామీల మీద హామీలు గుప్పించి ఐటి అభివృద్ధి పేరిట సృష్టించిన హంగామా ఇంకా చల్లారకముందే ఈ రంగం నుంచి నిరుద్యోగులు బయటపడటం గమనార్హం.
టాటా కన్సల్టెన్సీ వంటి సాఫ్ట్‌వేర్ సర్వీసుల రంగంలోని ప్రధాన సంస్థలు ఉద్యోగాల్లో కోత పెట్టనప్పటికీ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను బెంచి ఎక్కించిన మాట మాత్రం నిజం. మరికొన్ని రోజుల పాటు ప్రాజెక్టులు లేని స్థితి కొనసాగితే బెంచి పై ఉన్నవారికి ఉద్వాసన చెప్పడం ఖాయమని టాటా వర్గాలే అంటున్నాయి. చిన్న, మధ్య తరహా కంపెనీలయితే మరో మాటే లేకుండా పింక్ స్లిప్స్‌తో ఉద్యోగులను సాగనుంపుతున్నాయి.












Click it and Unblock the Notifications