కోట్ల వర్గం ఎదురుదాడి
హైదరాబాద్: కర్నూలు జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. కోట్లవిజయభాస్కర్ రెడ్డి ప్రత్యర్థి వర్గంపై ఎదురుదాడి ప్రారంభించింది. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి అనుచరుడువిష్ణువర్ధన్ రెడ్డిని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) పార్టీ నుంచి బహష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినవిష్ణువర్ధన్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చామని,విష్ణువర్ధన్ రెడ్డి ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయనను బహిష్కరించామని డిసిసి అధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని కర్నూలులోవిలేకరులతో చెప్పారు.
కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత జి. వెంకటస్వామి సోమవారంనాడు తీవ్రంగా ధ్వజమెత్తినవిషయం తెలిసిందే. పిసిసి అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావును సాగనంపాలని వెంకటస్వామికి ఉన్నదేమో గానీ కోట్లవిజయభాస్కర్ రెడ్డికి లేదని కరీంనగర్ జిల్లా జగిత్యాల కాంగ్రెస్ శాసనసభ్యుడు టి. జీవన్ రెడ్డివిమర్శించారు. ఆర్-కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను భ్రష్టుపట్టిస్తున్నారని వెంకటస్వామి చేసినవిమర్శను ప్రస్తావిస్తూ సత్యనారాయణరావు 1978 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగాబ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ తరఫున కరీంనగర్ ఇన్‌ఛార్జీగా వున్నారని ఆయన గుర్తు చేశారు.
పార్టీలోని పరస్పర విమర్శలపై వ్యాఖ్యానించడానికి పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావు నిరాకరించారు. తానేమీ మాట్లాడదల్చుకోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications