తెహల్కా తేజ్‌పాల్ పశ్చాత్తాపం
న్యూఢిల్లీః రాజకీయ, రక్షణరంగాల్లో మేటవేసుకుపోయిన అవినీతిని బట్టబయలు చేసేందుకు వినూత్న పంథాలో పరిశోధన జరిపిన తెహల్కా బృందం ఇప్పుడు, పరిశోధన క్రమంలో తాము అనుసరించిన కొన్ని పద్దతులపై పశ్చాత్తాపం ప్రకటిస్తున్నది. తమ పరిశోధనలో వేశ్యలను ఉపయోగించడం తప్పేనని తెహల్కా చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ ఎట్టకేలకు ప్రకటించారు.
ముఖ్యంగా అవినీతి అధికారి వేశ్యతో జరిపిన లైంగిక కార్యకలాపాలను కెమరాతో చిత్రించడం ద్వారా తమవిలేకురులు కట్టు తప్పిన విషయం అంగీకరించారు. అయితే భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా తాము జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తెహల్కా బృందం నీతి నియమాలను ఉల్లంఘింటిన మాట నిజమేఅయినప్పటికీ ఈ మొత్తం వ్యవహారాన్ని స్థూల దృష్టితో చూస్తే, చాలాపెద్ద విషయాలను బయటపెట్టడానికి తాము చేసిన చిన్న తప్పుగా ఇదిఅర్ధం అవుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications