నీటి సంఘాల ప్రక్షాళన: మండవ
హైదరాబాద్: రాష్ట్రంలోని నీటి వినియోగదారుల సంఘాలను ప్రక్షాళన చేయనున్నట్లు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి మండవ వేంకటేశ్వరరావు వెల్లడించారు. నీటి వినియోగదారుల సంఘాల పని తీరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. పని చేయని సంఘాలను తప్పించి వాటిని ప్రభుత్వంస్వాధీనం చేసుకుంటుందని ఆయన సమావేశానంతరం వేంకటేశ్వరరావువిలేకరులతో చెప్పారు. రాష్ట్రంలోని 10,292 నీటి వినియోగదారుల సంఘాలకు త్వరలో ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 64 సంఘాల పని తీరు బాగా లేదని నిర్ధారించినట్లు,వీటిలో 13 సంఘాలపై చర్యలు కూడా తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
నీటి వినియోగదారుల సంఘాల నిబంధనల్లో కొన్ని మార్పులు తెస్తామని ఆయన చెప్పారు.సర్వసభ్య సమావేశాలు నిర్వహించకపోతే, ఆడిట్ చేయకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. నీటి తీరువాలను నేరుగా రైతులకే ఇచ్చే ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications