ఫెర్నాండెజ్‌ను కలుసుకోని ఫరూఖ్ అబ్దుల్లా
న్యూఢిల్లీ: జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) కన్వీనర్ జార్జి ఫెర్నాండెజ్‌కు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాకు మధ్య జరగాల్సిన సమావేశం కాలేదు. ఎన్‌డిఎకు ఫరూఖ్ అబ్దుల్లా తన మద్దతు ప్రకటించినప్పటికీ ఫెర్నాండెజ్‌తో సమావేశం కాకుండానే వెళ్లిపోయారు. జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలపై ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి చేసిన ప్రకటనతో ఆగ్రహం చెందిన అబ్దుల్లా కినుక వహించారు.
అపోహలను తొలగించడానికి ఫరూఖ్ అబ్దుల్లాను తాను కలుస్తానని ఫెర్నాండెజ్ ఎన్‌డిఎ సమావేశంలో చెప్పారు.
ఎన్‌డిఎ ప్రవర్తనా నియమావళి రూపొందే వరకు వేచి చూడాలని ఫరూఖ్ అబ్దుల్లా భావిస్తున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ వర్గాలు చెప్పాయి. ఆ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల తీరుపై ప్రధాని చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహం చెందిన ఫరూఖ్ ఎన్‌డిఎ సమావేశంలో పాల్గొనకుండా వెనుదిరిగి పోయారు.అపోహలను తొలగించడానికి తాను అబ్దుల్లాను కలుస్తానని ఫెర్నాండెజ్ ఈ నెల 27న జరిగిన ఎన్‌డిఎ
సమావేశానంతరం విలేకరులకు చెప్పారు.












Click it and Unblock the Notifications