ఎట్టకేలకు పిసిసి కార్యవర్గం ఖరారు

న్యూఢిల్లీ: ఎట్టకేలకు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) కార్యవర్గాన్ని ఎఐసిసి ఖరారు చేసింది. పిసిసి కార్యవర్గ జాబితాను ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జిఅంబికా సోనీ గురువారం ఇక్కడ విడుదల చేశారు.ఎం. సత్యనారాయణరావు అధ్యక్షుడిగా వుండే పిసిసి కార్యవర్గంలో పది మంది ప్రధాన కార్యదర్శులు, తొమ్మండుగురు పాధ్యక్షులు, 36 మంది కార్యవర్గ సభ్యులు వుంటారు.విఠల్‌రావును కోశాధికారిగా నియమించారు.
తొమ్మండుగురు ఉపాధ్యక్షుల్లో నంది ఎల్లయ్య, దాసరి నారాయణరావు, పిన్నమనేని కోటేశ్వరరావు,ఆర్‌. చెంగారెడ్డి, గాదె వెంకటరెడ్డి, కల్పనాదేవి, షబ్బీర్‌ అలీ, నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఉన్నారు. పది మంది ప్రధాన కార్యదర్శుల్లో డి.ఎల్‌. రవీంద్రారెడ్డి, గల్లాఅరుణ, మల్లు రవి, ధర్మాన ప్రసాదరావు, ఎ.ఆర్‌. ఆమోస్‌ వున్నారు.

పిసిసి కార్యవర్గంలో పిసిసి అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు, కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి వర్గాలకు ప్రాధాన్యం లభించిందనిఅంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు కోట్లవిజయభాస్కర్‌ రెడ్డి వర్గానికి మొండి చేయి చూపారని భావిస్తున్నారు. కార్యవర్గంలోసీనియర్‌ నేతలు సూచించినవారందరి పేర్లు ఉన్నాయని పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావు అన్నారు. కోట్ల విజయభాస్కర రెడ్డి సూచించినవారిలో కమతం రాంరెడ్డికి తప్పమిగతా వారందరికీ చోటు లభించిందని ఆయన అన్నారు.

ఇదిలా వుండగా, ఉయ్యూరు శాసనసభా స్థానానికి కె. పార్థసారథి, సిద్ధిపేట నియోజకవర్గానికి వి. హనుమంతరెడ్డిపేర్లను పిసిసి ఖరారు చేసి ఆమోద ముద్ర కోసం ఎఐసిసికి పంపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+