వాజ్ పేయిపై ఎన్డీఏ మిత్రుల గుర్రు
న్యూఢిల్లీః క్యాబినెట్‌విస్తరణలో వాజ్ పేయి చూపిన సాహసం ఎన్డీఏలో విభేదాలకు జీవం పోసే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయని నేషనల్ కాన్ఫరెన్స్ వాజ్‌పేయి పై కత్తులు నూరుతున్నది. క్యాబినెట్ విస్తరణలో వాజ్‌పేయి ఓమర్ అబ్దుల్లాను చిన్నచూపు చూశారనేవిమర్శలు వున్నాయి.
వాజ్‌పేయి ధోరణితో విసిగిన కొందరు నేతలు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లాను రెచ్చగొతున్నారు. ఆయన తనయుడు ఓమర్ ఫరూఖ్ ను కేంద్ర మంత్రి పదవి నుంచి రాజీనామా చేయించి నిరసన వ్యక్తం చేయాల్సిందిగా వారు నూరి పోస్తున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలను చిన్నచూపు చూసి బిజెపికిపెద్దపీట వేశారని పలువురు నేతలు విమర్శించారు.
ఓమర్ ను క్యాబినెట్ కు రాజీనామా చేయించాల్సిందిగా పలువురు నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు ఫరూఖ్ పై ఒత్తిడి తెస్తున్నారు.పాశ్వాన్, శరద్ యాదవ్ వర్గాలు కూడా వాజ్ పేయిపై ఆగ్రహంతో వున్నారు. మంచి ఉద్దేశ్యంతో క్యాబినెట్ నువిస్తరించిన వాజ్ పేయి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నిరసనను ఎలా తిప్పికొడతారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications
