వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపిలో తెలంగాణా ముసలం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః బిజెపిలో మరోసారి తెలంగాణా ముసలం పుట్టింది. టైగర్‌ నరేంద్రగా పేరుపడ్డ మెదక్‌ఎం.పి. తెలంగాణా వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. బిజెపిలో ఇప్పటి వరకుమింగలేక కక్కలేక వున్న తెలంగాణా నేతలంతా నరేంద్ర గూటికి చేరితే బిజెపి కష్టాల్లో పడడం ఖాయం అని పరిశీలకులుఅంటున్నారు.

అయితే తెలంగాణా వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మెదక్‌ఎం.పి. టైగర్‌ నరేంద్రపై భారతీయ జనతాపార్టీ నిప్పులు చెరుగుతున్నది. పార్టీ నిబంధనలను అతిక్రమించిన ఎవరిమీదైనా క్రమశిక్షణా చర్యతీసుకుంటామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారంవిలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. 2004 వరకు చిన్న రాష్ట్రాల ఏర్పాటు ప్రసక్తి లేదనే ఎన్డీఏ ఎజెండాకు అనుగుణంగానే బిజెపి తెలంగాణా పై స్పష్టమైన వైఖరిని ప్రకటించిందని దత్తాత్రేయ చెప్పారు..

పార్టీ నియమావళిని అతక్రమించిన వారెవరైనా సహించేది లేదని దత్తాత్రేయ అన్నారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంపై బిజెపి మెతకమైఖరి అవలంబించినందువల్లే స్థానిక, పంచాయతీ ఎన్నికల్లో బిజెపి మట్టికొట్టుకుపోయిందని నరేంద్ర ప్రకటించడాన్ని దత్తాత్రేయ ఖండించారు. ఆశించిన రీతిలో కాకపోయినా బిజెపి మెరుగైన ఫలితాలు సాధించిందని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణా కోరుతూ గతంలో కొందరు బిజెపి ఎమ్మెల్ల్యేలు ఉద్యమం చేపట్టినప్పటికీ పార్టీ అధిష్టానం వారికి నచ్చచెప్పకలిగింది.

అయితే ఓ ఎం.పి. హోదా గల వ్యక్తి తెలంగాణా వేదికను ప్రకటించడంతో బిజెపి ఖంగు తిన్నది. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి వర్గవిస్తరణలో నరేంద్రకు మంత్రిపదవి దక్కుతుందనిఅంతా భావించారు. అయితే ఆయనకు క్యాబినెట్‌ లో ఛాన్స్‌ దక్కలేదు. పార్టీలో సైతం తనకుసరైన న్యాయం జరగలేదంటూ అక్కసుతో వున్న నరేంద్ర ఇప్పుడు తెలంగాణా పాట పాడుతున్నారని రాజకీయ వర్గాలుఅంటున్నారు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X