బాబు నిర్వాకంపై కాంగ్రెస్,లెఫ్ట్ ధ్వజం
కడపఃశాశ్వత కరవు నివారణ ఉద్యమంలో భాగంగా శుక్రవారం నాడు కాంగ్రెస్, వామపక్షాలు కడప, అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించాయి. కరవు నివారణ చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగావిఫలం అయిందని కడప కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన సి.ఎల్.పి. నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డివిమర్శించారు. రాష్ట్ర ఓ పక్క కరవుతో అల్లాడి పోతుంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఎలా అభివృద్ధి చేయాలాఅంటూ ఆత్మపరిశీలనా సదస్సుల్లో మునిగితేలుతున్నారని వై.ఎస్. ధ్వజమెత్తారు.
అనంతపురంలో కాంగ్రెస్ వామపక్షాల నేతలుపెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశం జరుగుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న కార్యకర్తలు జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అనంతలో మంచినీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హామీ ఇవ్వడంతో ప్రదర్శన కారులు శాంతించారు.
- కరవు ప్రాంతాల్లో అందరికీ పనిః బాబు












Click it and Unblock the Notifications