గుజరాత్ టీచర్లపై ఎస్మా
అహ్మదాబాద్‌ః గత పదిరోజులుగా సమ్మె చేస్తున్న గుజరాత్‌లోని 5500 పాఠశాలల సిబ్బందిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకోసం గత పదిరోజులుగా సమ్మె చేస్తున్నారు.
సమ్మెవిరమణకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలువిఫలం కావడంతో గురవారం అర్ధరాత్రి నుంచి ఎస్మాను ప్రయోగిస్తున్నట్టుగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉపాధ్యాయులతో పాటు బోధనేతర సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ టీచర్లతో సమానంగా పేస్కేళ్లు ఇవ్వాలని వెహికల్ అలవెన్సు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎస్మా హెచ్చరికలతో చాలా మంది ఉద్యోగులు దిగివచ్చారని వెయ్యికిపైగా స్కూళ్లను శుక్రవారం నాడు తెరిచారని ప్రభుత్వ వర్గాలు అంటుండగా ఉద్యోగ సంఘాలు మాత్రం దీనిని ఖండిస్తున్నాయి. నల్ల చట్టాలను ప్రయోగించి బలప్రయోగంతో తమను లొంగదీయడం సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు..
సమ్మెకట్టిన రెవిన్యూసిబ్బంది












Click it and Unblock the Notifications