ఫ్రీ ఇ మెయిల్‌కే కస్టమర్లపెద్దపీట
న్యూఢిల్లీః నిన్నమొన్నిటి వరకు ఫ్రీ ఇ మెయిల్ సర్వీసులను ఆఫర్ చేసిన ఇంటర్నెట్ సంస్థలు హఠాత్తుగా ఈ సర్వీసులకు ఫీజులు వసూలు చేయడం ప్రారంభించడంతో అత్యధిక శాతం వినియోగదారులు ఫ్రీ ఇ మెయిల్ ఆఫర్ చేస్తున్న సంస్థలవైపు మొగ్గు చూపుతున్నారు.
ఏళ్లుగా తమ సర్వీసులను నిబద్దతతో వాడుకుంటున్న కస్టమర్లు కచ్చితంగా తాము అడిగినంత ఫీజు ఇవ్వడం ఖాయమని నమ్మిన ఇంటర్నెట్ సంస్థలు పరిస్థితిని చూసి దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఢిల్లీ, చెన్నై, ముంబాయి, బెంగుళూరు, హైదరాబాద్, వంటి ఇంటర్నెట్ వ్యాప్తి విస్తృతంగా వున్న పట్టణాల్లో జరిపిన ఒక సర్వేలో వెల్లడయిన ప్రకారం 82 శాతం మంది మొహమాటం లేకుండా తాము ఫ్రీ ఇ మెయిల్ సర్వీసు ఆఫర్ చేసే కంపెనీలను ఆశ్రయిస్తున్నట్టుగా వెల్లడించారు. 10 శాతం మంది మాత్రం అలవాటయిన సర్వీసుకే సుంకం చెల్లించైనా కట్టుబడి వుంటామని చెప్పారు. ఎనిమిది శాతం మంది మాత్రం ఫ్రీగా వస్తున్నది కదా అని ఇ మెయిల్ ఉపయోగించడం ప్రారంభించామని ఈ ఫీజుల బెడద వల్ల అసలు నెబ్ వినియోగమే మానేయాలని నిర్ణయించినట్టుగా చెప్పారు.
సొంతగా ఇంటర్నెట్ సౌకర్యం వున్న వారి సంఖ్యే తక్కువని తాము ఎంతో కొంత మొత్తం చెల్లించే సైబర్ కేఫ్‌ల్లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తామని దానికి తోడుగా ఈ ఫీజుకూడా అనవసరమైన భారమని సర్వే చేసిన వ్యక్తులు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications