కొత్త జడ్జికి జయకేసు బదిలీ
న్యూఢిల్లీః తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టులోదెబ్బమీద దెబ్బ తగులుతున్నది. పెండింగ్ లో వున్న కేసులను సత్వరం పూర్తి చేయించి నవంబర్ 13 లోగాఅసెంబ్లీకి ఎన్నికై ముఖ్యమంత్రి పదవిని నిలుపుకోవాలనే జయ యత్నాలను సుప్రీం సాగనిచ్చే సూచనలు కనిపించడం లేదు.
తనకు శిక్షపడిన కేసులవిచారణపై ఇచ్చిన స్టే ఎత్తివేయాల్సిందిగా జయలలిత సుప్రీంకోర్టునుకోరారు. ఆమె అభ్యర్థనను పరిశీలించిన సుప్రీం జయ కేసులను ప్రస్తుతం వున్న జడ్జి కాకుండా వేరే న్యాయమూర్తి చేతవిచారణ జరిపించాలని, అక్టోబర్ ఒకటి తరువాతే ఆ కేసువిచారమ ప్రారంభించాలని శుక్రవారం ఆదేశించింది. జయలలిత నవంబర్ 13 లోగాఅసెంబ్లీకి ఎన్నిక కావలసి వున్నందున సాధ్యమైనంత త్వరగావిచారణ ప్రారంభం అయ్యేలా చూడాలని జయతరవు న్యాయవాది వేణుగోపాల్ వాదించారు. అయితేఅందుకు సుప్రీం సమ్మతించలేదు.
కీలకమైన ఈ కేసును మద్రాసు హైకోర్టులో సింగల్ జడ్జి సారధ్యంలో కాకుండా మరింత విస్తృతమైన బెంచి ద్వారావిచారించాలని జస్టిస్ బరుచా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వున్న తాత్కాలకి ప్రధాన న్యాయమూర్తి స్థానంలో వచ్చే నూతన ప్రధాన న్యాయమూర్తి జయకేసులను ఏ జడ్జివిచారించాలనేది నిర్ణయిస్తారని జస్టిస్ బరుచా వెల్లడించారు. కొత్త న్యాయమూర్తికి కేసును బదిలీ చేయడం,అక్టోబర్ ఒకటి తరువాత కానీ జయ కేసు విచారణ ప్రారంభించరాదని ఆదేశించడం జయకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టే అవకాశం వుంది.
ఈ సంగతి అలా వుంచితే శిక్షపడిన తాను ముఖ్యమంత్రిగా కొనసాగడంపైవిచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఎలా వుంటుందోనని జయలలిత ఆందోళన పడుతున్నారు.












Click it and Unblock the Notifications