సమ్మె విరమించిన ఉస్మానియాసిబ్బంది
హైదరాబాద్‌ః రెండు రోజులుగా సమ్మె చేస్తున్న ఉస్మానియా ఆస్పత్రి నర్సులు, హౌస్ సర్జన్లు శుక్రవారం సమ్మెవిరమించారు. దీనితో నానా అవస్థలు పడుతున్న రోగులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అసలే అరకొర వసతులు, ఆపైన నర్సులు, హౌస్ సర్జన్ల సమ్మెతో రెండు రోజులుగా రోగులు నరకయాతన పడ్డారు.
ఒక రోగి బంధువులు ఆస్పత్రి నర్సుపై చేయి చేసుకున్నారనే కోపంతో బుధవారం నాడు నర్సులు సమ్మె ప్రారంభించారు. వారికి మద్దతుగా గురువారం హౌస్ సర్జన్లు కూడా విధులు బహిష్కరించడంతో రోగుల బాధలు వర్ణనాతీతంగా మారాయి.
ఆస్పత్రి సిబ్బందికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని ఆస్పత్రి సూపరింటిండెంట్ హామీ ఇవ్వడంతో సమ్మెకుస్వస్తి చెప్పినట్లు హౌస్ సర్జన్లు చెప్పారు. ఆస్పత్రిలో భద్రత కట్టుదిట్టం చేస్తామని సూపరింటిండెంట్ చెప్పారు. గత రెండు రోజులుగా హౌస్ సర్జన్లు నర్సులు రోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ వచ్చిన ఆరోపణలపైవిచారణ జరుపుతున్నటుల సూపరింటిండెంట్‌వివరించారు. ఆయితే ఈ విచారణ తూతూమంత్రంగా సాగుతున్నదనేవిమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications