ఎవరు కాదన్నా మార్చిలో రామాలయం
న్యూఢిల్లీః వచ్చే ఏడాది మార్చి 12 తరువాత ఏ క్షణంలోఅయినా అయోధ్యలో రామాలయ నిర్మాణం చేపట్టనున్నట్లువిశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు ఆచార్య గిరిరాజ్ కిషోర్ శుక్రవారం షోలాపూర్ లోవిలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎవరు అడ్డు వచ్చినా అయోధ్యలో రామాలయ నిర్మాణం ఆగదని ఆయన తేల్చి చెప్పారు.
జనవరి 20న అయోధ్య నుంచి శాంతి చేతావని యాత్ర ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. గురుగోవింద్ సింగ్ జయంతిఅయిన జనవరి 27 నాటికి ఈ యాత్ర ఢిల్లీ చేరుకుంటుందని ఆయన తెలిపారు. ఈ యాత్రలో పాల్గొన్న సాధువులు వాజ్‌పేయిని కలుసుకొని అయోధ్య నిర్మాణంలో వున్న అవరోధాలను తొలగించాల్సిందిగావిజ్ఞప్తి చేస్తారని కిషోర్ వివరించారు. ఫ్రిబ్రవరి 17 నుంచి అయోధ్యలో ఆరు నెలల పాటు పూర్ణకుంభ యాగం నిర్వహిస్తున్నట్లు ఆయనవివరించారు.
ఈ ఏడాది చివర్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. ఈ తరుణంలోవిశ్వహిందూ పరిషత్ మళ్ళీ అయోధ్య ఊసెత్తడంవిశేషం.












Click it and Unblock the Notifications