రెవిన్యూ సమ్మె వాయిదా
హైదరాబాద్‌ః రెవిన్యూ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి నుంచి జరపతలపెట్టిన సమ్మెను వాయిదా వేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు సమ్మెను వాయిదా వేసుకున్నట్టుగా యూనియన్ నాయకులు ప్రకటించారు.
రెవెన్యూ మంత్రిఅశోక్ గజపతిరాజుతో శుక్రవారం నాడు సమావేశమై తమ డిమాండ్ల పై చర్చ జరపనున్నట్టుగా వారు చెప్పారు. ఈ చర్చలువిఫలమైతే పదో తేదీనుంచి మళ్లీ సమ్మె ప్రారంభిస్తామని వారు వెల్లడించారు. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొని వున్న ప్రస్తుత తరుణంలో ఉద్యోగులు సమ్మెకు దిగడం సమంజసం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబువిజ్ఞప్తి చేసిన విషయం విదితమే.
సమ్మెకట్టిన రెవిన్యూసిబ్బంది












Click it and Unblock the Notifications