పేదరికంతో కుటుంబం ఆత్మహత్య
నెల్లూరుః ఆర్ధిక ఇబ్బందు కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరులోని ఉస్మాన్‌సాహెబ్ పేటలో జరిగింది. మూడు రోజుల క్రితమే ఈ సంఘటన జరిగినప్పటికీ గురువారం నాటికి గానీ బయటపడలేదు.
గురువారం నాడు ఇంటినుంచి దుర్వాసన వెలువడుతుండటంతో ఇరుగుపొరుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చండూరు శేషాచలం ఆయన భార్య పద్మావతి, కుమారుడుసురేష్, కుమార్తె ప్రసన్న లక్ష్మి, భారతి అనే మరో మహిళవిషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శేషాచలం కుటుంబం ఏడాది క్రితం కోవూరు నుంచి నెల్లూరు వలస వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరూ స్థానిక బట్టల షాపుల్లో గుమాస్తాలుగా పనిచేస్తున్నట్టుగా తెలిసింది. ఆర్ధిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు.ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications