ఆర్థికరంగానికి నూతనోత్తేజంః వాజ్‌పేయి
న్యూఢిల్లీః భారత ఆర్థిక వ్యవస్థకు కాయకల్ప చికిత్స అవసరం అని ప్రధాని వాజ్‌పేయి అభిప్రాయపడ్డారు. సరికొత్త వ్యూహంతో మాత్రమే ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని ఆయన అన్నారు. ఆర్థికవ్యవస్థకు జవజీవాలు కల్పించేందుకు సత్వరం చర్యలు చేపట్టనున్నట్లు శుక్రవారం జరిగిన భారత పారిశ్రామిక, వాణిజ్య సలహా మండలి సమావేశంలో అన్నారు. భారత్ స్టాక్ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలతో ప్రజలలో మార్కెట్ పై నమ్మకం పోతున్నదని ఆయన అన్నారు. ప్రజలలో నమ్మకం కలిగించాల్సిన బాధ్యత పారిశ్రామిక వేత్తలపైనే వున్నదని ఆయన అన్నారు.
స్టాక్ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాల పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా కూడా బాధను వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్ లో త్వరలో నూతనోత్తేజం నెలకొల్పేందుకు కృషి చేస్తామని యశ్వంత్ హామీ ఇచ్చారు.
భారత ఆర్థిక రంగం పరిపుష్టికి ప్రధాని ప్రకటించిన చర్యలుః
- బాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తక్కువ రేటుకు రుణాలు సేకరించడం.
- మౌలిక సదుపాయాల కల్పనా రంగానికి ప్రాధాన్యం.
- వ్యవసాయ రంగానికి పెద్దపీట
- రైల్వే రంగంలో పెను సంస్కరణలు.
- రాష్ట్ర విద్యుత్ రంగాల ప్రక్షాళన
- ఐ.టి. ఇ-గవర్నెన్స్ కు ప్రాధాన్యం
- పథకాల అమలు సంవత్సరంగా 2002-2003.












Click it and Unblock the Notifications