పదవులపై శివసేన అసంతృప్తి
ముంబాయిః శివసేన మళ్లీ ఎన్‌డిఎ సర్కారు పై అసంతృప్తి రాగం మొదలుపెట్టింది. అయితే ఈ సారి కేంద్రంలో తమ పార్టీ వారికి కేటాయించిన మంత్రిత్వ శాఖలపై శివసేన తన ఆసంతృప్తిని వ్యక్తం చేసింది.
వాజ్‌పియి ప్రభుత్వంలో నాలుగవ మంత్రిపదవినికోరే నైతిక హక్కు తమ పార్టీకి వున్నప్పటికీ తాము మూడు పదవులతో సరిపెట్టుకున్నామని, మంత్రివర్గంలోకి తీసుకున్నవారికైనా ప్రధాన శాఖలను కేటాయించివుండాల్సిందని శివసేన నేత బాల్‌థాకరే అన్నారు. బిజెపికి చెందిన పలువురు సహాయ మంత్రులుస్వతంత్రంగా తమ శాఖలను నిర్వహిస్తుంటే శివసేన మంత్రులకు ఆ అవకాశం ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు.విద్య కాషాయీకరణను సమర్ధిస్తూనే పాఠ్యాంశంగా జ్యోతిష్యాన్ని ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. జ్యోతిష్యాన్ని నేర్చుకుని జ్యోతిష్‌శాస్త్రవేత్తలు కావాలనుకునేవారికి ఆ అవకాశాలు వున్నాయనివిశ్వవిద్యాలయాల్లో దానిని పాఠ్యాంశంగా పెట్టడం సరికాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications