హైదరాబాద్ లో ఐఎస్‌ఐ పంజాః బిజెపి
హైదరాబాద్‌ః సిద్దిపేట వ్యవహారంలో తెలుగుదేశం-కాంగ్రెస్ పార్టీల సిగపట్ల బాగోతం నడుస్తుండగా హైదారాబాద్ లో ఐ.ఎస్.ఐ. కార్యకలాపాలపై బిజెపి రణభేరి మోగించింది. రాష్ట్ర రాజధానిలో ఐఎస్‌ఐ కార్యకలాపాలు ఆందోళనకరమైన స్థాయిలో జరుగు తున్నాయని, కీలకమైన ఈ వ్యవహారంపై వాయిదా తీర్మానానికి అనుమతించాలని బిజెపి సభా పక్ష నేత ఇంద్రసేనారెడ్డికోరారు.
అయితే సిద్దిపేటలో డబ్బు పంపిణీ వ్యవహారంపై తెలుగుదేశం, కాంగ్రెస్ వర్గాలు వాగ్వివాదానికి దిగడంతో ఇంద్రసేనారెడ్డి వేదనఅరణ్య రోదనగానే మారింది.
బిజెపి ప్రవేశ పెట్టిన వాయిదా తీర్మానాన్ని కూడా తిరస్కరిస్తున్నట్లుస్పీకర్ ప్రతిభా భారతి ప్రకటించారు. ఇందుకు బిజెపి సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట రభస మధ్య బిజెపి తీర్మానం ప్రవేశ పెట్టడం చివరకు వృధా ప్రయాసగానేమిగిలింది.












Click it and Unblock the Notifications