దేశం నేతలపై టిఆర్‌ఎస్ దాడులు
సిద్ధిపేట: ఓటర్లకు బహిరంగంగా నోట్లు పంపిణీ చేస్తున్న తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకులను ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకుఅప్పగించారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం సిద్ధిపేటలో జరిగింది. రాజ్యసభ సభ్యుడు, తెలుగుదేశం నాయకుడు సోలిపేట రామచంద్రారెడ్డిని, రాష్ట్ర కార్యదర్శి, డిసిఎంఎస్ చెర్మన్‌ఎ.కె. గంగాధర్ రావును ప్రజలు నిర్బంధించి పోలీసులకుఅప్పగించారు.
కార్మిక మంత్రి సి.కృష్ణాయాదవ్, మాజీ మంత్రి శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావులపై దాడికి ఉపక్రమించగాఅంగరక్షకుల భద్రతా వలయంలో డబ్బు సంచులతో వెళ్లిపోయారు.
ఈ దాడిలో శాసనసభ్యులు శ్రీనివాస్ యాదవ్, బాబూమోహన్, రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి, మాజీ శాసనసభ్యుడు నర్సింలు,ఎ.కె. గంగాధర్ రావు గాయపడినట్లు చెబుతున్నారు. వారి వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనతో సిద్ధిపేటలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు 144సెక్షన్ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలుగుదేశం పట్టణ ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజం ఇంట్లో తాము సమావేశమై వుండగా రెండు సార్లు టిఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ మోటారుసైకిళ్లపై వీధిలో తిరిగారని, సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా లక్ష్మీరాజం ఇంట్లోకి దూసుకొచ్చి తమపై దాడి చేశారని సోలిపేట రామచంద్రారెడ్డిఅంటున్నారు. బీరువాను తెరిచి నగలు, నగదు దోచుకుపోయారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications